Breaking News

ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా భారీ రక్తదాన శిబిరం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎం ఎల్ ఎల్ బోండా ఉమామహేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా భారీ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని ఈ రక్తదాన శిబిరంలో టీడీపీ, బా జ పా, జనసేన కూటమి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదానం చేసి విజయవంతం చేయాలని టీడీపీ సెంట్రల్ టి ఎన్ ఎస్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ తెలిపారు

సత్యనారాయణపురం శివాలయం వీధిలో వేద హాస్పిటల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టిడిపి నాయకులు మనోజ్ కుమార్,వేద హాస్పిటల్ సీఈవో వై శేష సాయి, శ్రీ వేద చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ వై శిరీష రాణి, డాక్టర్ గురునాథ్ శర్మ పాల్గొని ముందుగా ఎమ్మెల్యే బోండా ఉమా పుట్టినరోజు పురస్కరించుకొని రక్తదాన శిబిర బ్రోచర్ ను ఆవిష్కరించారు
అనంతరం మనోజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి టిడిపి యువనేత బోండా రవితేజ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని ప్రత్యేకంగా క్యాన్సర్ బాధితుల సహాయార్థం ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మనోజ్ కుమార్, వేద హాస్పిటల్ సీఈవో వై శేష సాయి, శ్రీ వేద చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ వై శిరీష రాణి, డాక్టర్ గురునాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *