గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాను అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ప్రజాప్రతినిధుల సూచనలు సహకారంతో , సమిష్టి కృషితో జిల్లా యంత్రాంగం సమర్ధవంతంగా అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టరు ఎస్ నాగలక్ష్మి తెలిపారు.
ఆదివారం స్థానిక పోలీసు కవాతు మైదానంలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీస్ పెరేడ్ ను పరిశీలించారు. పోలీసు బలగాలు, ఎన్ సీ సీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాడెట్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హెనీ క్రిస్టీనా, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ , శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి ఏసురత్నం, శాసనసభ్యులు గళ్లా మాధవి, మహమ్మద్ నసీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు , అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాద్, అడిషనల్ ఎస్పీ సుప్రజ, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సందేశమిస్తూ జిల్లాకు చెందిన ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేశారని, వారికి నివాళులర్పిస్తున్నామన్నారు. ఎందరో మహనీయులు, మేధావుల కృషివల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి, 1950 జనవరి 26వ తేదీ నుండి అమలులోకి వచ్చిందని, ఈ శుభ దినమున మన దేశము ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఏర్పడిందన్నారు. ఈ సందర్భముగా భారత రాజ్యాంగ రూపకర్త బాబా సాహెబ్ డా. బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకొని, నివాళులర్పించటం మనందరి కర్తవ్యం అన్నారు. 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.
జిల్లాలో ప్రభుత్వ శాఖలలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలు , శాఖల వారీగా సాధించిన ప్రగతిని జిల్లా కలెక్టరు వివరించారు.
ప్రభుత్వ శాఖలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై శకటాల ప్రదర్శన:-
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరిస్తూ శకటాల ప్రదర్శన కొనసాగింది. ప్రకృతి వ్యవసాయం, రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇతర పధకాల పై వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మన పాఠశాల మన భవిష్యత్, డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రా పధకం , విద్యాశాఖలో అమలు చేస్తున్న పధకాల పై విద్యా శాఖ – సమగ్ర శిక్ష శాఖ, క్యాన్సర్ స్క్రీనింగ్, హెచ్ ఎం పీ వీ అవగాహన,108,104 సేవలపై జిల్లా వైద్యారోగ్యశాఖ, పీఎంఎవై , ఎన్ టీ ఆర్ నగర్ ఇళ్ళ నిర్మాణం పై గృహనిర్మాణ సంస్థ, ఉన్నతి మహిళా శక్తి ఆటో, రూఫ్ టాప్ సోలార్, డ్వాక్ర సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాల పంపిణీ తదితర సంక్షేమ కార్యక్రమాలపై డీఆర్డీఏ- వెలుగు పధకం శాఖ, వ్యర్ధాల నిర్వహణ, స్వచ్ఛ స్వర్ణ గ్రామాల సాధన పై జిల్లా పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ , దీపం 2 పథకం , మద్ధతు ధరకు దాన్యం కొనుగోలు తదితర కార్యక్రమాలపై పౌరసరఫరాలు శాఖ మరియు సంస్థ, స్వఛ్చతా హీ సేవా పై గుంటూరు నగరపాలక సంస్థ, రహదారి భద్రతా నిబంధనలపై జిల్లా రవాణాశాఖ, సక్షమ్ అంగన్ వాడీ ఫౌండేషన్ స్కూలు ఇతర కార్యక్రమాలపై జిల్లా మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ, అగ్నిప్రమాదాల నివారణ, విపత్తుల సహాయ చర్యలకు వినియోగించే అత్యాధునిక సామగ్రి పై రాష్ట్రవిపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖల శకటాల పెరేడ్ ను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి , ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పరిశీలించారు.
దేశభక్తి స్పూర్తితో కొనసాగిన విధ్యార్ధుల సాంస్కృతిక ప్రదర్శనలు:-
జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల విద్యార్దులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యకార్యక్రమాలు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను కీర్తీస్తూ, దేశభక్తిని చాటేలా కొనసాగాయి. శ్రీ వెంకటేశ్వర బాల కుటీర్, శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఇంగ్గీష్ మీడియం ఉన్నత పాఠశాల, సెయింట్ జోసఫ్స్ ఇంగ్లీషు మీడియం స్కూలు, సెయింట్ లారెన్స్ ఇంగ్లీషుమీడియం స్కూలు, ఆక్స్ ఫర్డ్ హైస్కూలు, డీల్లీ పబ్లిక్ స్కూలు విద్యార్ధులు దేశభక్తి గీతాలకు నృత్య ప్రదర్శనలు చేశారు. పోలీస్ శాఖ డాగ్ షో, మహిళా మీకోసం – మీ సంరక్షణే మా సంకల్పం స్కిట్ లు ప్రదర్శించారు.
సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలో పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ కు మొదటి బహుమతి, సెయింట్ లారెన్స్ పబ్లిక్ స్కూల్ కు ద్వితీయ బహుమతి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు తృతీయ బహుమతి ని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అందించారు. శకటాల ప్రదర్శనలో జిల్లా విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ మొదటి బహుమతి, గుంటూరు నగరపాలక సంస్థ కు ద్వితీయ బహుమతి, గృహనిర్మాణ సంస్థకు తృతీయ బహుమతి జిల్లా కలెక్టరు అందించారు. ప్రభుత్వ శాఖలలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి, స్వఛ్చందసేవా సంస్థ ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ప్రశంసా పత్రాలు అందించారు.
గణతంత్రదినోత్సవం సంధర్భంగా జిల్లాలోని స్వాతంత్ర్య సమరయోదులు, అమరవీరుల కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఘనంగా సన్మానించారు. స్వాతంత్ర్య సమర యోధులు అనుమోలు సూరయ్య కు రెండు సెంట్ల ఇంటి నివేశ స్థలం పట్టాను అందించారు.
అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా ఉద్యావన శాఖ, ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి -వెలుగు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ,జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శాఖ, జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖ, జిల్లా నీటి యాజమాన్యం సంస్థ , చేనేత జౌళి శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ, జిల్లా పోలీస్ శాఖ, సీపీడీసీఎల్ , పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. స్టాల్స్ ప్రదర్శనలో మొదటి స్థానం సాధించిన వ్యవసాయశాఖ, ద్వితియ స్థానం సాధించిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, తృతీయ స్థానం సాధించిన జిల్లా గ్రామీణాభివృద్ధి –వెలుగు శాఖ, కన్సులేషన్ బహుమతి జిల్లా పశుసంవర్ధక శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మెమోంటోలను అందించారు.
ఏపీఎంఐపీ శాఖ ద్వారా 22 మంది లబ్ధిదారులకు రూ. 10 లక్షల విలువ కలిగిన స్పింకర్లు, స్పేయర్ల మంజూరు పత్రాలను, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధర్వంలో వృత్తి విద్యా నైపుణ్యాలలో శిక్షణ పొందిన నిరుద్యోగులకు సర్టిఫికేట్లు, జాబ్ మేళాలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ఆఫర్ లెటర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా విధ్యార్దులకు ల్యాప్ టాప్ లు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎపి ఇండస్ట్రీయల్ డెవలప్మేంట్ కార్పోరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీస్ సర్వీస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, డిప్యూటీ మేయరు సజీలా, జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతిబసు, ఆర్డిఓ కె. శ్రీనివాస రావు , జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. వెంకటేశ్వర్లు , లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి , సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ జి. లక్ష్మీ , జిల్లా సప్లయ్ అధికారిణి పి. కోమలి పద్మ , జాయింట్ రిజిస్టర్ డిస్ట్రిక్ట్ కో ఆపారేటివ్ ఎం. వీరాచారి , ఏ. డి ట్రాన్స్ జెండర్ మరియు సీనియర్ సిటిజన్స్ సిహెచ్. సువార్త , అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సమగ్ర శిక్ష జి. విజయ లక్ష్మీ , డిస్ట్రిక్ట్ డిజాస్టర్ ఫైర్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస రెడ్డి , డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ పి. గాలి దేముడు , డిడి గ్రౌండ్ వాటర్ డి. వందనం , జిల్లా హార్టి కల్చర్ అధికారి బి. రవీంద్ర బాబు , పీడీ ఏపిఎంఐపి ఎల్.వజ్రశ్రీ , డియం అండ్ హెచ్ ఓ డా. విజయలక్ష్మీ , ఎన్ టీ ఆర్ వైద్య సేవ ట్రస్ట్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ డా. సిహెచ్. విజయ్ ప్రకాష్ , ఎస్ ఈ పంచాయితీ రాజ్ జి.బ్రహ్మయ్య , సిపిఓ శేషశ్రీ , డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ డి. శైలజ , ఎస్. ఈ ఆర్ అండ్ బి ఆర్. శ్రీనివాస మూర్తి , ఎస్. ఈ ఆర్ డబ్ల్యూ ఎస్ కె. కళ్యాణ్ చక్రవర్తి , సాంఘీక సంక్షేమ అధికారి డి.మధుసూధన రావు , డిఎస్డిఓ ఓ. నరసింహ రావు, ఈడి బీసీ కార్పొరేషన్ కె. మయూరి , డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎం హిమ శైలజ , పీడీ హౌసింగ్ జె. వి. ఎస్.ఆర్.కె.వి. ప్రసాద్, ఎస్ ఈ ఇరిగేషన్ పి. వెంకట రత్నం , డీడీ మైన్స్ అండ్ జియాలజీ డి.వెంకట సాయి, జిల్లా పంచాయితీ అధికారి బి. వి. నాగసాయి కుమార్, పీడీ డీఆర్డీఏ టీవి. విజయలక్ష్మీ, పీడీ డ్వామా వి. శంకర్ , ఏ.డి సర్వే ఏ.పవన్ కుమార్, డీటీసీ కె.సీతరామిరెడ్డి , డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టఇవర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎం.వి.శివకుమార్ రెడ్డి తదితర జిల్లా అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబసభ్యులు, విద్యార్ధులు, ప్రజలు, పాల్గొన్నారు.