Breaking News

అన్న క్యాంటీన్లకు డిమాండ్ కు తగిన విధంగా సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్న క్యాంటీన్లకు వచ్చిన వారికి ఆహారం అందలేదని ఫిర్యాదులు రాకుండా, డిమాండ్ కు తగిన విధంగా సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. మంగళవారం మిర్చి యార్డ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని జిఎంసి ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో అన్న క్యాంటీన్లకు పేద ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందన్నారు. నగరంలోని 7 క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు పూటకు రూ.5 కే ఆహారం తింటున్నారన్నారు. క్యాంటీన్లకు వస్తున్న పేదవారికి ఎవ్వరికీ ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూడదని, అందుకు తగిన విధంగా ఆహారం సరఫరా జరిగేలా అక్షయపాత్ర సిబ్బంది అందించాలన్నారు. క్యాంటీన్ లో అందించే త్రాగునీటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి క్యాంటీన్ లో నిర్దేశిత సమయంలో ఆహారం అందించాలని, అక్షయపాత్ర సిబ్బంది, జిఎంసి అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. క్యాంటీన్ లో క్యూ ఆర్ కోడ్ బోర్డ్ లు కనిపించేలా ఏర్పాటు చేయాలని, ప్రజలు తమ అభిప్రాయాలను క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలియచేయవచ్చన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి

-రాష్ట్రంలో రక్షణ రంగంలో పెట్టుబడులకు విస్తారంగా అవకాశాలు -ముఖ్యమంత్రికి సతీష్ రెడ్డి ప్రజెంటేషన్ -ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నరని వెల్లడి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *