-సీఎం చంద్రబాబు సూచించినట్లు ప్రతి 30 మంది ఓటర్లకు ఒక పరిశీలకుడిని నియమించాలి.
-తొలి ప్రాధాన్యత ఓటుపై అవగాహన కల్పించాలి.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్మోహన్ రెడ్డి అనే దుష్టశక్తిని ఒకసారి భూమిలో పాతిపెడితే సరిపోదని, అతనికి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నంలోని ఎం.వి.ఆర్ కళ్యాణమండపంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుని ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యుల ప్రత్యేక ఆత్మీయ సమావేశం మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ముందుగా అన్న ఎన్టీఆర్ గారి ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ నేరస్తుడని, అతను చాప కింద నీరులా ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటాడని, కూటమి కుటుంబ సభ్యులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ సమావేశంలో లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురాం, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్నా), మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ నూతులపాటి బాలకొటేశ్వరరావు (బాల) పాల్గొన్నారు.
ఈ సమావేశంలో లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మాట్లాడితూ జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ నేరస్తుడని, అతను చాప కింద నీరులా ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటాడని, కూటమి కుటుంబ సభ్యులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ… ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా,గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం తథ్యమన్నారు. మైలవరం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 13,510 గ్రాడ్యుయేట్ ఓటర్లను నమోదు చేసినందుకు ముందుగా ఎన్డీయే కూటమి కుటుంబ సభ్యులను అభినందించారు. ఓటు నమోదు చేయించటం ఎంత ముఖ్యమో, ఆ ఓటర్ పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేసే విధంగా కూడా చూడటం కూడా అంతకంటే ముఖ్యమన్నారు. సార్వత్రిక ఎన్నికలకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యత్యాసం వుంటుందన్నారు. ఓటర్లకు తొలి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ మెజార్టీతో సాధించిన గెలుపు చరిత్రలో నిలిచిపోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు తక్కువ మాత్రమే సమయం మిగిలి వుందన్నారు. మైలవరం నియోజకవర్గంలోని ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఎక్కడ వున్నారనే పూర్తి సమాచారం కలిగి వుండాలన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించినట్లు ప్రతి 30 మంది ఓటర్లుకు ఒక పరిశీలకుడిని నియమించాలన్నారు. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా 450 మంది పరిశీలకులను నియమించాల్సి ఉందన్నారు. ఈ నెల 7వ తేదీన ఆలపాటి రాజా నామినేషన్ వేయబోతున్నట్లు ప్రకటించారన్నారు. ఫిబ్రవరి 27 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ పోలింగ్ పూర్తి అయ్యే వరకూ సమన్వయంతో పని చేయాలన్నారు. దాడులు, కక్షలు, కార్పణ్యాలు, కేసులు మన సంస్కృతి కాదన్నారు. అభివృద్ధి, ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ నాయకత్వంలో అందరం క్రమశిక్షణతో పని చేద్దామన్నారు.
ఈ సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్, బూత్, ఇన్చార్జీలు, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి, నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.