టీడీపీ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు

-నందిగామ మున్సిపల్ ఛైర్ పర్సన్ గా కృష్ణకుమారిని ఎన్నుకున్నాం
-టీడీపీలో అభిప్రాయ భేదాలంటూ కొంతమంది దుష్ప్రచారం
-నా అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి వివరించా
-గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై చర్యలు తప్పవు : ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఏపీ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. అధిష్టానం ఆదేశాలతో అందరూ కృష్ణకుమారిని ఛైర్మన్‌గా ఎన్నుకున్నామని తెలిపారు. ‘‘టీడీపీలో అభిప్రాయ బేధాలు అని ‌కొంత మంది ప్రచారం చేశారు. మా టిడిపి ‌కుటుంబంలొ ఎటువంటి విభేధాలు లేవు, నా అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి వివరించాను. వారు అన్నీ పరిశీలించి కృష్ణకుమారి పేరును చైర్మన్‌గా ఎంపిక చేశారు. కొంతమంది కావాలనే మాపై అసత్య ప్రచారం చేశారు’’ అంటూ మండిపడ్డారు. ఓటింగ్ జరగదంటూ వైసీపీ సభ్యులు పడ్డ ఆనందం ఆవిరి అయ్యిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ ద్వారా మున్సిపల్ చైర్మన్ టీడీపీ దక్కించుకుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే సుమారు 4 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నందిగామ మున్సిపాలిటీలో చేసి చూపించామన్నారు. నందిగామను అన్ని‌విధాలా అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పనులు చేయకుండా దొంగ బిల్లులతో దోపిడీ చేశారని ఆరోపించారు. వాటి పై విచారణ చేసి తప్పకుండా తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సౌమ్య వెల్లడించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలి: సౌమ్య
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని, కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. మంగళవారం కాకాని నగర్ కార్యాలయంలో కూటమి శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకునిగా గుడివాడ మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరావు ని నియమించినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను అనేక ఇబ్బందులకు గురిచేసింది. కనీసం ఒకటో తేదీన జీతాలు కూడా అందించలేకపోయింది. నాడు మద్యం దుకాణాల వద్ద గురువులకు విధులను కేటాయించిన పరిస్థితి. వివిధ యాప్‌లతో టీచర్లను ఉక్కిరిబిక్కిరి చేసేవారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు పరిశుభ్రత బాధ్యత కూడా వారిపై పెట్టి చులకనగా చూసేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ఉపాధ్యాయులను గౌరవిస్తూ పాలన సాగిస్తున్నారు. టీచర్ల మద్దతుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పెద్దలు నిర్ణయించిన అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *