-సి.పి.ఐ. రామకృష్ణ, మాజీ ఎం.ఎల్.సి. జల్లి విల్సన్ విజ్ఞప్తి మేరకు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాపితంగా మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు ఏళ్ళ తరబడి ప్రజాజీవితంలో మమేకమై సేవలు చేశారు. నేటికీ చేస్తున్నారు కూడా. వీరు వయస్సు మీరడంతో వృద్ధాప్యంలో పలు శారీరక రుగ్మతలతో, ఆర్థిక యిబ్బందులతో, కుటుంబ భారాలతో సతమతమవుతున్నారు. వీరిలో ఎక్కువమంది బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదవారే వున్నారు. అధిక ధరలు, నిత్య అవసరాలు పెరిగిపోయిన దృష్ట్యా మాజీ ప్రజాప్రతినిధులకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నెలకు యిస్తున్న పెన్షన్ 30 వేల రూపాయలు సరిపోవడం లేదు. గత 10 సంవత్సరముల నుండి మన రాష్ట్రంలో పెన్షన్ పెరుగుదల లేనేలేదు. మన నుండి విడిపోయిన తెలంగాణా రాష్ట్రంలో మాత్రం గత 5 సంవత్సరముల నుండి మాజీ ప్రజాప్రతినిధులకిచ్చే పెన్షన్‌ను కనిష్ఠంగా 50 వేలు, గరిష్ఠంగా 70 వేలు పరిగణలోకి తీసుకుని మన రాష్ట్రంలోని మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులకు పెన్షన్‌ను 50 వేలకు పెంచి యిచ్చేందుకు పరిశీలించి చర్యలు తీసుకోవలసిందిగా సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, ఎ.పి. ఫార్మర్ లెజిస్లేటర్స్ ఫోరం వైస్ ప్రెసిడెంట్, మాజీ ఎం.ఎల్.సి. జల్లి విల్సన్‌లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును అసెంబ్లీలో వారి కార్యాలయంలో స్వయంగా కలిసి విజ్ఞప్తి చేయగా, సానుకూలంగా స్పందించడం జరిగింది. వృద్ధులైపోయి కొంతమంది, దీర్ఘకాలిక వ్యాధులతో మంచాలకే పరిమితమైన మాజీ ప్రజాప్రతినిధులు, వారిపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకుని ఉపశమనం కలిగించాలని రామకృష్ణ, విల్సన్‌లు ప్రత్యేకంగా కోరగా దానిపై చంద్రబాబునాయుడు తెలంగాణా ప్రభుత్వ గజెట్‌ను పరిశీలించి సానుకూల చర్యలు తీసుకుంటానని హామీ యిచ్చారన్నారు.