Breaking News

ఆంధ్రా హాస్ప‌ట‌ల్‌లో మిల్క్ బ్యాంకు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ విచ్చేసిన ప్ర‌ముఖ సినీ న‌టుడు మహేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త ప్ర‌కాశం రోడ్డులోని ఆంధ్రా హాస్ప‌ట‌ల్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన మిల్క్ బ్యాంకును ముఖ్య అతిథిగా హాజ‌రైన న‌మ్ర‌త ప్రారంభించారు. అనంత‌రం మీడియా స‌మావేశంలో న‌మ్ర‌త మాట్లాడుతూ, ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ రూ.ముప్పై ఏడులక్షల వ్యయంతో అనేక కారణాల వల్ల తల్లిపాలు అందని నవజాత శిశువులకు అదనపు తల్లిపాలు కలిగిన దాతల ద్వారా చనుపాలు సేకరించి, అందించాల‌న్న‌ది ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ‌మ‌ని తెలిపారు. డబ్బా పాలు వద్దు – తల్లి పాలు ముద్దు అనే నానుడి ప్రకారం సహజంగా తల్లి నుండి చనుపాలు నోచుకోలేని నవజాత శిశువులకు ఈ ప్రాజెక్ట్ గొప్ప వరం అన్నారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ ఈ ప్రాజెక్టుకు మౌలిక వసతులు కల్పించి శాశ్వతమైన ప్రాజెక్టుగా నిర్వహించడానికి ముందుకు రావ‌డం ప‌ట్ల వారిని అభినందించారు. ఇటువంటి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో మొట్ట మొదటిద‌ని చెప్పారు. తల్లి పాలు శ్రేష్ఠమైనవని, తల్లి పాలు తక్కువ వున్నా వారికి, నెలలు నిండకుండా పుట్టిన వారికి, బరువు తక్కువతో పుట్టిన వారికి ఈ మదర్స్ మిల్క్ బ్యాంకు ద్వారా పాలు ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ‌త 25 సంవ‌త్స‌రాలుగా వైద్య రంగంలో ముఖ్యంగా పేదవారికి, మధ్య తరగతి వారికి అనేక సేవలను అందిస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్ అధినేత డాక్ట‌ర్ పి.వి.రమణమూర్తి, మేనేజింగ్ డైరెక్టర్, డాక్ట‌ర్ పి.వి.రామారావు, డాక్ట‌ర్ పద్మ త‌దిత‌రులు హాస్పిటల్స్‌లో అందిస్తున్న సేవలను అభినందిస్తున్నామన్నారు. గత 10 సంవత్సరాల్లో 4500 పైగా పిల్లల హార్ట్ సర్జరీలు మరియు ఇంటర్వెన్షన్స్ విజయవంతంగా చేసినందుకు నమ్రత, మహేష్ బాబు ఫౌండేషన్‌కి, ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యానికి పిల్లల కార్డియాక్ టీమ్‌కి అభినందనలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో పిల్లల కార్డియాలజిస్ట్ కె.విక్రమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *