నగర సుందరీకరణ పెంచేందుకు చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర అందాన్ని మరింత పెంచేందుకు సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయం ముందు గల కాలువ సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర నగర అందాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని, అందుకు అధికారులు పర్యవేక్షించి హరితాన్ని పెంచే దిశగా ప్రాంతాలను పరిశీలించి, ఒక నివేదికను సమర్పించాలని అన్నారు. ఆ ప్రాంతాలను సుందరీకరించటమే కాకుండా, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ, కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ పర్యటనలో డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, సూపరిండెంటింగ్ ఇంజనీర్ వర్క్స్ పి. సత్యకుమారి, పార్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంచార్జ్ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆత్మవిశ్వాసంతో హాజరుకండి

-టెన్త్ విద్యార్థులకు మంత్రి సవిత శుభాకాంక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ( మార్చి 17)నుంచి జరగబోయే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *