-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా బోర్స్ ను పునరుద్ధరించండి అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా డివిజన్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు స్థానిక కార్పొరేటర్ ఉద్దంటి సునీత తో కలిసి ఒకటవ డివిజన్ ప్రాంతం లో గల మధుర నగర్ పప్పుల మిల్ సెంటర్, రైల్వే ట్రాక్ ఏరియా, గుణదల నుండి రామవరప్పాడు వెళ్లే సర్వీస్ రోడ్, కార్మల్ నగర్, విఎంసి ఎంప్లాయిస్ కాలనీ, పరిసర ప్రాంతాలన్ని పర్యటించి పరిశీలించారు. కార్పొరేటర్ తో ఒకటవ డివిజన్లో ఉన్న సమస్యలను మొత్తం తెలుసుకొని ఆ సమస్యలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వాహణ, దోమల సమస్యలను తెలపగా అధికారులు ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. విఎంసి ఎంప్లాయిస్ కాలనీ పర్యటించి ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని రోడ్లను, స్ట్రీట్ లైట్లను, తదితర మౌలిక వసతులు అన్ని కల్పించి ఆరు నెలలలో ఆ కాలనీ అభివృద్ధిపరిచేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలాలలో పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా జరగాలని, యజమానులకు నోటీసులు జారీ చేసి వారి స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలని, దాని ఎప్పటికప్పుడు సానిటరీ ఇన్స్పెక్టర్లు, అధికారులు పర్యవేక్షిస్తుండాలని ప్రజారోగ్య సిబ్బందిని ఆదేశించారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి సత్యకుమారి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డాక్టర్ లత, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి వెంకటనారాయణ, రీజినల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.