-జిల్లాలో ఏడు నియోజక వర్గాలలో 27,441 మంది లబ్దిదారులు గుర్తింపు
-పిఎంఏవై గ్రామీణ, అర్బన్ 1.0 పధకం కింద కాకుండా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రత్యేక గ్రాంట్
-గృహ నిర్మాణ పురోగతి మేరకు 4 దశల్లో ఆర్ధిక సహాయం విడుదల చెయ్యాలి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఏడు నియోజక వర్గాలలో అసంపూర్తిగా నిర్మాణ దశలో ఉన్న ఎస్ సి, బి సి, ఎస్ టి గృహ లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం పూర్తి చెయ్యడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో మూడు దశల్లో ఆర్ధిక సహాయం అందించేయ్యనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల క్షేత్ర స్థాయి, మండల ప్రత్యేక అధికారులతో గృహ నిర్మాణాల అదనపు ఆర్ధిక సహాయం విడుదల చెయడం పై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలలో భాగంగా పీఎం ఎవై గ్రామీణ, పట్టణ 1.0 పధకం కు అదనంగా గ్రాంట్ రూపంలో ఎస్ సి, బిసి లకు రూ.50 వేలు చొప్పున, ఎస్ టి లకి రూ.75 , పిజిటీ గ్రూప్ లకి రూ. లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందచేస్తున్నట్లు తెలియ చేశారు. ఇంటి నిర్మాణ పనులకు సంబంధించి నిధుల విడుదల చెయ్యడం లో నాలుగు దశల్లో ఆర్ధిక సహాయం విడుదల చెయ్యాలి అని పేర్కొన్నారు. తొలి, రెండవ దశల్లో రూ 15 వేలు చొప్పున, మూడు నాలుగు దశల్లో రూ.10 వేలు చొప్పున నిధులను లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని ఆదేశించారు. లబ్దిదారులలో అవగాహన కల్పించే చర్యలలో స్ధానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రజలతో మమేకం అవ్వాలని కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. లబ్దిదారులు గుర్తింపు విధానంలో కుల ధృవీకరణ తప్పనిసరి అని పేర్కొన్నారు. తాజా కుల ధృవీకరణ పత్రం ను నిర్ధారణ చేసుకుని మాత్రమే లబ్దిదారులు గుర్తింపు ఉండాలని ఇందుకు , డిజిటల్ సర్టిఫికెట్ ను ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యడం ముఖ్యం అన్నారు.
ఈ దశలో నిర్మాణాలు చేపట్టే వారి కోసం కొత్త మాడ్యూల్ అనుసరించి డేటా ఎంట్రీ చెయ్యాల్సి ఉంటుందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులు , హౌసింగ్ ఏ ఈ , డి ఈ , ఈ ఈ లు నిర్మాణ దశల పురోగతిని అప్లోడ్ చెయ్యాలని ఆదేశించారు. జిల్లా గృహ నిర్మాణ అధికారి ప్రాజెక్ట్ డైరెక్టర్ పర్యవేక్షణా చెయ్యడం జరుగుతుందని పేర్కొన్నారు. స్టేజ్ కన్వర్షన్ కు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి మాత్రమే నిర్ధారణ చేయాలన్నారు. ఇండ్ల సందర్శన, కుల ధృవీకరణ, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవడం పై ప్రత్యేక అధికారులు దృష్టికేంద్రీకరించాలని ఆదేశించారు. గృహ నిర్మాణం లో టాయిలెట్స్, సోప్ పిట్స్ నిర్మాణం చేపట్టడం ముఖ్యం అన్నారు. ఫీల్డ్ విజిట్ సందర్భంలో తప్పనిసరిగా ఫోటో క్యాప్చర్ చేయాలని కోరారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హౌసింగ్ పిడి ఎస్. భాస్కర్ రెడ్డి, డ్వామా పిడి ఎ. నాగమల్లేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ బివి గిరి, జిల్లా పశు సంవార్డక అధికారి కే. శ్రీనివాస రావు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు