రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర – స్వచ్ఛంధ లక్ష్యంగా రాష్ట్ర క్షేత్ర స్థాయిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ప్రతి నెల మూడోవ శనివారం స్ఫూర్తి దాయకంగా నిలిచేలా స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం క్షేత్ర స్థాయి అధికారులకి “స్వర్ణాంధ్ర – స్వచ్ఛంధ” కార్యక్రమం చేపట్టడం పై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచనలు జారీ చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తణుకు పట్టణంలో మార్చి 15 వ తేదీ స్వర్ణాంధ్ర – స్వచ్ఛంధ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోందని తెలియ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణా, స్వచ్ఛత గ్రామ సభలు, ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం, గృహ సోక్ పిట్స్ & కంపోస్ట్ పిట్‌ల నిర్మాణం & నిర్వహణ , పర్యవేక్షణా , నివేదికలు ఎప్పటి కప్పుడు అప్లోడ్ చెయ్యాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో జిల్లా నీటి యాజమన్య సంస్ధ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమన్వయ కర్త గా పర్యవేక్షణా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వ్యర్థాల విభజన మరియు కంపోస్టింగ్ నిర్వహణలో గృహ భాగస్వామ్యాన్ని నిర్ధారించుకోవడం ద్వారా స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ కార్యక్రమం విజయవంతం చేయడంలో ఎంపిడివో లు కీలక బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. ఆయా క్షేత్ర స్థాయిలో నిర్వహించే క్రమంలో స్ధానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చెయ్యాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డ్వామా పిడి ఏ. నాగ మహేశ్వర రావు, క్షేత్ర స్థాయిలో మండల అధికారులు, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News