-“వెబ్ ఆప్షన్స్” సర్వీస్ చివరి తేది: 15-03-2025
-ఉప సంచాలకులు యం.యస్. శోభారాణి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సాంఘిక సంక్షేమ శాఖ, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం ద్వారా యస్.సి. యస్.టి. అభ్యర్ధులకు ఉచితంగా డి.యస్.సి. కోచింగ్ ఇవ్వనున్నట్లు, దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 15 వ తేదీ వరకు గడువు ఉందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు, శ్రీమతి. యం. యస్. శోభారాణి గురువారం ఒక ప్రకటన తెలియ చేశారు.
ఉచిత డి.యస్.సి కోచింగ్ సంభందించి జ్ఞానభూమి పోర్టల్ నందు https://mdfc.apcfss.in వెబ్ పోర్టల్లో ఉచిత డి ఎస్ సి కోచింగ్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన SC /ST అభ్యర్థులు జాబితా మరియు “వెబ్ ఆప్షన్స్” ఇవ్వడమైన దన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ ఆప్షన్ కోరకు మార్చి 15 వ తేదీ వరకు మాత్రమే స్వీకరించనున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తూర్పు గోదావరి జిల్లాలో శిక్షణాకార్యక్రమం అందజేసేందుకు “స్వయం కృషి గురుకృపా ఎడ్యుకేషన్ సొసైటి, రాజమహేంద్రవరం” ను ఎంపిక చేసినట్లు తెలిపారు.
https://mdfc.apcfss.in వైభ్ పోర్టల్ ద్వారా నమోదు చేసి యున్న కోచింగ్ సంస్థలకు తమ ప్రాధాన్యతలను తెలియజేయాలనీ, కావున అసక్తి కలిగిన మరియు అర్హత ఉన్న యస్.సి. / యస్.టి అభ్యర్ధులు పైన తేలియపర్చిన వెబ్ పోర్టల్ ద్వారా తమ వెబ్ ఆప్షన్లను సకాలంలో పూర్తి చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.