గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సరళంగా సామాన్యులకు అర్దమయ్యే విధంగా తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకురి మొల్లమాంబ అని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ కొనియాడారు.
గురువారం కలక్టరేట్ లోని వీసీ హాల్ లో ఆతుకురి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకొని వారి చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డిఆర్ఓ షేక్.ఖాజావలి , వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆతుకూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొల్లమాంబ సాహిత్య సేవలను తెలుగు ప్రజలు ఎల్లవేళలా గుర్తుంచుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్ఓ షేక్. ఖాజావాలి, కుమ్మరి, శాలివాహన సమన్వయ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు యు.వెంకటేశ్వర్లు , కుమ్మరి, శాలివాహన సంక్షేమ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కె.నాగేశ్వరి మొల్లమాంబ వారి జీవిత చరిత్రను , వారు రచించిన మొల్ల రామాయణ విశిష్టతను ఈ సందర్భంగా గుర్తు చేసారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ భవాని , కుమ్మరి, శాలివాహన సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి పిడతల నాగమల్లేశ్వర రావు, చిరతనగండ్ల వాసు , బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
