వైసిపి సర్కారు వారసత్వంగా రూ.2,536 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలిచ్చింది

-బకాయిలను కూటమి ప్రభుత్వం తీరిస్తూ వస్తోంది
-అసెంబ్లీలో వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యశ్రీ పథకం అమలులో పేరుకుపోయిన బకాయిలు తమకు వైసిపి ప్రభుత్వం నుండి వారసత్వంగా వచ్చాయని వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గురువారం శాసనమండలిలో సభ్యులు ఇళ్ళా వెంకటేశ్వరరావు, కెఎస్ లక్ష్మణరావు, బొర్రా గోపి మూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు గత ప్రభుత్వ హయాంలో రూ.2,536 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక తెలిసిందన్నారు. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు గత ప్రభుత్వం ద్రుష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా నిష్ఫలమైనట్లు తమకు తెలిసిందన్నారు.

పేదలకు నాణ్యమైన వైద్యసేవలను నిరంతరాయంగా అందచేసేందుకు వీలుగా డాక్టర్ వైద్యసేవ ద్వారా బకాయిలను దశలవారీగా చెల్లించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

కూటమి ప్రభుత్వం గతేడాది జూన్ 5నుండి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద రూ.1,745.60 కోట్లు మరియు ఎంప్లాయిస్ హెల్త్ పథకం క్రింద రూ.125.21 కోట్లు చెల్లించిందనీ, అలాగే ఫిబ్రవరి, 2025 నాటికి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం క్రింద ఆసుపత్రులకు బకాయి పడిన రూ.1,937.15 కోట్లు మరియు ఎంప్లాయిస్ హెల్త్ పథకం క్రింద రూ.31.78 కోట్లు చెల్లించాల్సి ఉందని మంత్రి తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఇహెచ్ఎస్) సేవలకు సంబంధించి ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్న అంశంపై తమకు ఫిర్యాదులందాయని చెప్పారు. డాక్ట ర్ ఎన్టీఆర్ వైద్య సేవతో సమానంగా వైద్యం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం వారి వేతనాల నుండి మినహాయించిన సొమ్ము వైద్యసేవ ట్రస్ట్ అందలేదని తమకు అధికారులు తెలిపారని వివరించారు. ఆయా ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని ఉద్యోగుల వాటాకు సంబంధించిన ఈ సొమ్మును వైద్యసేవ ట్రస్ట్ అందచేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులకు రీ- ఇంబర్స్ మెంట్ వరకు వెళ్లకుండానే వైద్య సేవలు అందించే ప్రయత్నాలు చేస్తున్నామని, వారికి నిరంతరాయంగా వైద్యసేవలందించేందుకు వీలుగా నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలతో కూడా సంప్రదిస్తున్నామని వివరించారు. ఎయిడెడ్ స్కుళ్ళ ఉద్యోగులకు ఎన్టిఆర్ వైద్యసేవ ట్రస్ట్ సేవలందించేందుకు వారి వాటా సొమ్మును, వారు కానీ సంబంధిత యాజమాన్యాలు కానీ ప్రభుత్వానికి చెల్లిస్తే మిగిలిన 50 శాతం వాటాను ప్రభుత్వం భరించి వైద్యసేవలందించేందుకు సిద్ధంగా వుందన్నారు. ఈ అంశాన్ని మరోసారి సమీక్షించి వారికి మెరుగైన వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆత్మవిశ్వాసంతో హాజరుకండి

-టెన్త్ విద్యార్థులకు మంత్రి సవిత శుభాకాంక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ( మార్చి 17)నుంచి జరగబోయే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *