గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని జాతీయ రహదారీ వెంబడి వ్యర్ధాలను తొలగించడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. గురువారం కమిషనర్ ఆదేశాల మేరకు బయాలజిస్ట్ రామారావు నేతృత్వంలో కాకాని జంక్షన్ నుండి బుడంపాడు జంక్షన్ వరకు కార్మికులు జాతీయ రహదారి వెంబడి ఉన్న వ్యర్ధాలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి వ్యర్ధాలు గుట్టలుగా ఉంటున్నాయని, రాత్రి సమయాల్లో వ్యర్ధాలను వేసే వారిని గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యర్ధాలకు కొందరు ఆకతాయిలు నిప్పు పెట్టడం వలన వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కల్గుతుందన్నారు. కనుక ప్రజలు కూడా సహకరించి, వ్యర్ధాలను రహదారి వెంబడి వేయకుండా సహకరించాలని కోరారు.
