అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురంలో డయేరియా ప్రబలటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. డయేరియా నివారణకు తక్షణ చర్యలు, మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. డయేరియా ప్రబలిన దాదాపు పది గ్రామాలలో 20 వైద్య బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అధికారులు సీఎంకు వివరించారు. అవసరమైతే మరికొన్ని ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వే జరిపి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కల్పిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు వివరించారు.
Tags amaravathi
Check Also
ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి…
-పిఆర్సి చైర్మన్ ని వెంటనే నియమించాలి. -పెండింగ్ లో ఉన్న డిఏలు మంజూరు చేయాలి. -జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ …