-కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ వెల్లడి
-రాష్ట్ర మహిళా సాధికారత కేంద్రాలపై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి లావు కృష్ణ దేవరాయులు
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా 35 రాష్ట్ర మహిళా సాధికారత కేంద్రాలు (SHEW), అలాగే 28 రాష్ట్రాలు, 8 ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లోని వివిధ జిల్లాల్లో 742 జిల్లా మహిళా సాధికారత కేంద్రాలు (DHEW) పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జిల్లాకు ఒకటి చొప్పున 26 జిల్లాలలో 26 జిల్లా మహిళా సాధికారత కేంద్రాలు వున్నాయని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ వెల్లడించారు.
మిషన్ శక్తి కార్యక్రమం కింద రాష్ట్ర మహిళా సాధికారత కేంద్రాలు, జిల్లా మహిళా సాధికారత కేంద్రాలకు కేటాయించిన నిధుల వివరాలు, దేశం వ్యాప్తంగా పనిచేస్తున్న రాష్ట్ర మహిళా సాధికారత కేంద్రాలు, జిల్లా మహిళా సాధికారత కేంద్ర వివరాలు తెలియపర్చాలంటూ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి లావు శ్రీ కృష్ణ దేవరాయులు లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ శుక్రవారం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్ మాత్రం రాష్ట్ర మహిళా సాధికారత కేంద్రం ఇంకా ప్రారంభించలేదన్నారు. మిషన్ శక్తి మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర, జిల్లా మహిళా సాధికారత కేంద్రాల్లో రెండు లింగ నిపుణులు (Gender Specialists) నియమాకాలు వుంటాయన్నారు. ఈ పథకం కింద ఎపికి 2022-23లో 2 కోట్ల 12 లక్షల 49 వేల రూపాయలు విడుదల చేయగా, 2023-24 , 2024-25 సంవత్సరాల్లో నిధులు ఏమి విడుదల చేయలేదని వివరించారు
Prajavartha Online Telugu News