Breaking News

ఎపిలో గ‌త ప‌దేళ్లుగా స్థిరంగా ఎరువుల వాడకం

-కేంద్ర రసాయనాలు, ఎరువుల ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వెల్ల‌డి
-ఎరువుల ఉత్పత్తి, వినియోగం పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎంపి ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద‌రావు

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
డైఅమ్మోనియం ఫాస్ఫేట్ ఎరువు, పోటాష్ తదితర ఎరువుల వాడకం గత దశాబ్ద కాలంలో పెరిగినా సూక్ష్మ పోషకాలను పెంచే చర్యలు చేపట్టినందువల్ల ఎరువుల వాడకం మరింత పెరగకుండా ఆగినట్లు
ఎంపీలు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని), దగ్గుమళ్ల ప్రసాదరావు వేసిన ప్రశ్నకు కేంద్ర రసాయనాలు, ఎరువుల ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జవాబు ఇచ్చారు.

గడచిన పదేళ్లలో అమోనియం ఫాస్ఫేట్, పొటాషియం తదితర ఎరువుల వాడకం, ఉత్పత్తి, కేటాయింపుల గురించి లోక్ సభలో శుక్ర‌వారం వేసిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఆంధ్ర ప్రదేశ్లోని జిల్లా వారీ గణాంకాల సమాచారం ఇచ్చారు. 2024-25లో మట్టిలో వుండే సూక్ష్మ పోషకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఆర్గానిక్ కార్బన్, మట్టి లోని లవణాల స్థాయి కి సంబంధించి 4.22 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కృష్ణాజిల్లా లో 16400 శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *