Breaking News

నందమూరి బాలకృష్ణకి పద్మ భూషణ్ అవార్డు

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు గ్రహీతలకు పద్మ పుర‌స్కారాలు ప్రదానం చేశారు. ఈ వేడుకలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ నుండి హీరో నందమూరి బాలకృష్ణకి కేంద్రం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. కళారంగంలో, సామాజిక సేవలకు గాను బాలకృష్ణకు పద్మభూషణ్ పుసరస్కారం వరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. అవార్డ్స్ వేడుకకు నందమూరి బాలకృష్ణ తెలుగుదనం ఉట్టిపడేలా పంచె క‌ట్టులో హాజరయ్యారు.

ఐదు దశాబ్దాలపైబడి తెలుగు చలనచిత్ర సీమలో వెండితెరపై విభిన్న పాత్రలు పోషించాడు బాలకృష్ణ. ఆయన సినీ కెరీర్‌లో, 110 చిత్రాలలో, ఆయన తన అసాధారణ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అంతేకాకుండా హిందూపురం శాసన సభ్యుడిగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ గా ఎన్నో సేవలందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులతో పాటుగా, బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, కూతురు తేజస్విని ఆయన భార్య వసుందర పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *