-వంద కేజీల బియ్యం అందించిన ఎన్డీఏ కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలకు ఆపత్కాలంలో నేనున్నానంటూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఎమ్మెల్యే గా గెలిచిన నాటి నుంచి తనదైన శైలిలో నియోజవర్గ ప్రజల కోసం విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు.బీజేపీ కార్యకర్త సయ్యద్ రజాక్ అలీ కుటుంబానికి శుక్రవారం ఎన్డీఏ కార్యాలయంలో వంద కేజీల బియ్యం అందించారు. రాజా రాజేశ్వరి పేటకు చెందిన రజాక్ అలీ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. తన కుమార్తెకు వివాహం నిశ్చయమైందని తన ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమేనని సహాయం చేయాలని ఎన్డీఏ కార్యాలయాన్ని సంప్రదించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ సయ్యద్ రజాక్ కు వంద కేజీల బియ్యం అందించి చేయూతనిచ్చారు. ఎమ్మెల్యే సుజనాకు రజాక్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ కూటమి నేతలు యేదుపాటి రామయ్య, నాగోతి రామారావు, బొల్లేపల్లి కోటేశ్వరరావు, ఏలూరి సాయి శరత్, మహేష్, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News