Breaking News

నగర పాలక వార్డ్, సర్కిల్ స్థాయిలలో యోగాంధ్ర పోటీలు

-జూనియ‌ర్‌, యంగ్‌, సీనియ‌ర్ గ్రూప్ కేట‌గిరీల్లో పోటీలు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మే 21 నుంచి జూన్ 21 వ‌ర‌కు యోగాంధ్ర మాసోత్స‌వాల్లో భాగంగా వార్డ్, సర్కిల్ స్థాయి యోగా పోటీలు జ‌ర‌గ‌నున్నాయ‌ని.. వార్డ్ స్థాయి విజేత‌లు సర్కిల్ స్థాయికి, సర్కిల్ స్థాయి విజేత‌లు జిల్లాస్థాయికి, జిల్లాస్థాయి విజేత‌లు రాష్ట్ర‌స్థాయికి అర్హ‌త సాధిస్తార‌ని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం కనకదుర్గ వారధి వద్దగల రివర్ ఫ్రెంట్ పార్క్ లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని , నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆస‌నాల ప్ర‌ద‌ర్శ‌న (సూర్య న‌మ‌స్కార్ ఛాలెంజ్‌, ప్రాణాయామం, మెడిటేష‌న్‌), ఆర్టిస్టిక్ యోగా (యోగా సాంగ్‌, యోగా పెయింటింగ్‌, యోగా స్కిట్‌, రోల్‌ప్లే), వైజ్ఞానికి యోగా (యోగా క్విజ్‌, యోగా పోస్ట‌ర్‌, యోగా స్లోగ‌న్‌, యోగా ఎస్సే), యోగా షార్ట్‌ఫిల్మ్‌, యోగా ఫొటోగ్ర‌ఫీలో పోటీలు జ‌రుగుతాయ‌ని, గ్రూప్ విభాగంలో సింక్ర‌నైజ్డ్ గ్రూప్ యోగా, మిక్స్‌డ్ ఏజ్ గ్రూప్ యోగా పోటీలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. జూనియ‌ర్ గ్రూప్ (10-18 ఏళ్లు), యంగ్ గ్రూప్ (19-35 ఏళ్లు), సీనియ‌ర్ గ్రూప్ (35 ఏళ్లు, ఆపైన‌) కేట‌గిరీల్లో పోటీలు జ‌రుగుతాయ‌ని.. వార్డు స్థాయి పోటీలు మే 26 నుంచి 30వ తేదీ వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని.. ఔత్సాహికులు ఆయా వార్డ్ కార్య‌ద‌ర్శిని సంప్ర‌దించాల‌ని సూచించారు. యోగా స్లోగ‌న్‌, యోగా షార్ట్‌ఫిల్మ్‌, యోగా ఫొటోగ్ర‌ఫీ విభాగాల్లో పోటీప‌డాల‌నుకునే ఔత్సాహికులు త‌మ ఎంట్రీల‌ను జూన్ 10వ తేదీలోగా vmcyogandhra@gmail.com మెయిల్‌కు పంపించాల్సి ఉంటుందని, త‌మ ఎంట్రీల‌తో పాటు పేరు, చిరునామా, మొబైల్ నంబ‌రు వివ‌రాల‌ను తెలియ‌జేయాలి. వివిధ పోటీల్లో విజేత‌ల‌కు అవార్డుల ప్ర‌దానం ఉంటుంద‌ని, ఔత్సాహికులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కే షమీ, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) విభాగం పి వెంకట నారాయణ, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *