Breaking News

మంత్రి నారా లోకేష్ తో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను కలిసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
భార‌త ఉప‌రాష్ట్ర‌ప్ర‌తి జ‌గ‌దీప్ ధ‌న్క‌ర్ ను ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో రాష్ట్ర విద్య‌, ఐటి, ఎల‌క్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తో క‌లిసి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ బుధ‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌ల‌వ‌టం జ‌రిగింది. ఉప‌రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధ‌న్క‌ర్ ను మంత్రి నారా లోకేష్ శాలువాతో స‌త్క‌రించి…226 రోజులపాటు 3,132 కి.మీ.ల మేర తాను చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలను కళ్లకుకడుతూ రూపొందించిన యువగళం పుస్తకాన్ని అందజేశారు. పాదయాత్ర ద్వారా ఎపి ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ ను ఉపరాష్ట్రపతి ధన్కర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, సానా సతీష్ బాబు, బైరెడ్డి శబరి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *