Breaking News

మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ను క‌లిసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ను ఢిల్లీలోని ఆయ‌న కార్యాల‌యంలో రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ తో క‌లిసి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ బుధ‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌ల‌వ‌టంజ‌రిగింది. పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ కు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. దీనికి కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ… ఎపిలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తిస్థాయి సహకారం అందిస్తామ‌న్నారు. అంత‌కు ముందు మంత్రి నారా లోకేష్ కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ నుశాలువాతో స‌త్క‌రించి యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, సానా సతీష్ బాబు, బైరెడ్డి శబరి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *