న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ బుధవారం కలవటంజరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జూలై 5 న ఏపీలో నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను లోకేష్ తో పాటు కలిసి ఆహ్వానించటం జరిగింంది. మంత్రి నారా లోకేష్ అడిగిన వెంటనే ఆగస్ట్ లో విద్యా శాఖ మంత్రుల కాంక్లేవ్ ఏర్పాటు కు ఆంధ్రప్రదేశ్ కు అవకాశం కల్పించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఎంపీ కేశినేని శివనాథ్ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు శబరి, సానా సతీష్, లావు కృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, బస్తిపాటి నాగరాజు లతో పాటు కేంద్ర, రాష్ట్ర విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News