హౌసింగ్ పై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని జగనన్న లేఅవుట్ల ఇళ్ల నిర్మాణంపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సోమవారం సాయంత్రం, స్థానిక జిల్లాపరిషత్ సమావేశపు మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్, జిల్లాలోని అన్ని మండలాల ఎంపిడిఓలు, ఏఇ. డిఇ, తహసీల్దార్లతో జగనన్న లేఅవుట్లలో నిర్మించే ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో సకాలంలో ఇళ్ల నిర్మాణం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సమావేశంలో పాల్గొన్న అధికారులను ఆయన ఆదేశించారు. లబ్ధిదారులతో మీటింగులు ఏర్పాటు చేసి లేఅవుట్లలో లబ్దిదారులు సొంతంగా ఇళ్లను నిర్మించుకోవడం లేదా కాంట్రాక్టర్ తో డై-అప్ అయ్యి ఇళ్లను నిర్మించుకొనేలా లబ్దిదారులను ప్రోత్సహించాలని కోరారు. సొంతంగా నిర్మించుకొనే వారికి ఇసుక, సిమెంటు, స్టీలు సకాలంలో సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్దిదారులకు సరఫరా చేసే ఇసుక, సిమెంట్, స్టీలు వివరాలు ఆన్ లైన్ లో పొందుపరచి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని సూచించారు. పల్లపు లేఅవుట్లలో మెరక చేయించడానికి ఆ ప్రాంతానికి కేటాయించిన సైట్లనుండి గాని లేదా స్థానికంగా ఉన్న చెరువు మట్టిని ఉపయోగించుకొనేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 1448 లేఅవుట్లలో 1227 లేఅవుట్లకు మెరక పనులు పూర్తయ్యా యని, మిగిలినవి కోర్టు సమస్యలు, వర్షాల వల్ల పెండింగ్ లో ఉన్నాయని అధికారులు ఆయనకు తెలిపారు. వర్షాలు తగ్గాక మిగతా లేఅవుట్లకు మెరక పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు.

ఫీవర్ సర్వే నిత్యం చేసేలా చర్యలు తీసుకోవాలి…
కోవిడ్ దృష్ట్యా గ్రామ, వార్డు సచివాలయాల్లోని వాలంటీర్లు వారానికి ఒక సారి కాకుండా ప్రతిరోజు ఫీవర్ సర్వే చేసేలా ఎంపిడిఓలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఫీవర్ సర్వే వివరాలను నిత్యం పరిశీలించేలా చూడాలన్నారు. అదేవిధంగా సచివాలయ మహిళా కాని స్టేబుళ్లు కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు మరియు పెళ్లికాని యువతులతో మీటింగులు ఏర్పాటు చేసి ఈవ్ టీజింగ్, లైంగిక వేదింపులు వంటివి వారి దృష్టికి తీసుకువచ్చేలా ఎంపిడిఓలు చర్యలు తీసుకోవాలన్నారు. దిశ యాప్ ఉపయోగం పై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. కె.మాధవీలత, సబ్ కలెక్టర్ నుపూర్ అజయ్ కుమార్ అసిస్టెంట్ కలెక్టర్ శోభిత, ఆర్టీఓ ఎస్ఎస్ కె.ఖాజావలి, హౌసింగ్ పీడీ కె.రామచంద్రన్, డ్వా మా పీడి జి.వి.సూర్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *