ఏపీలో అత్యాధునిక అంతర్జాతీయ స్థాయి వైద్య సౌకర్యాలతో ఇన్ఫినిటీ డయాగ్నస్టిక్స్…


-ఇన్ఫినిటీ డయాగ్నస్టిక్స్, మేనేజింగ్ డైరెక్టర్ డా. ఇందిరా రాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక వైద్య యంత్రాలు, పరికరాలతో ఏర్పాటైన ఇన్ఫినిటీ డయాగ్నస్టిక్స్ రెండవ బ్రాంచ్ ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలోని టిక్కీల్ రోడ్ లో ప్రజలకు అందుబాటులో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఎన్నో అవార్డులు, సర్టిఫికెట్స్ సాధించిన ప్రముఖ గోల్డ్ మెడలిస్ట్, యూకే పార్లమెంట్ వారి అవార్డుగ్రహీత ఇన్ఫినిటీ డయాగ్నస్టిక్స్, మేనేజింగ్ డైరెక్టర్ డా. ఇందిరా రాజు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఫినిటీ డయాగ్నస్టిక్స్, మేనేజింగ్ డైరెక్టర్ డా. ఇందిరా రాజు మాట్లాడుతూ ఇన్ఫినిటీ డయాగ్నస్టిక్స్ ప్రధాన కేంద్రం ఇప్పటికే హైదరాబాద్ లో పనిచేస్తున్నదని, పేషెంట్ లకు అందుబాటులో వుండే విధంగా విశిష్టమైన వైద్య సేవలను ఇన్ఫినిటీ డయాగ్నస్టిక్స్ హామీ ఇస్తుందన్నారు. సి టి స్కాన్, అల్ట్రా సౌండ్ , సోనామమ్మోగ్రామ్, లాబరేటరీ పరీక్షలు, అనుభవజ్ఞులైన డాక్టర్లచే పర్యవేక్షణ, మరియు పేషెంట్లకు వ్యక్తిగత శ్రద్ధ, ఏ ఆటంకం లేకుండా డాక్టర్లను సంప్రదించే సౌలభ్యము, పేషంట్ల వ్యక్తిగత అవసరాలకు తగినట్లుగా వైద్యసేవలు తమ ప్రత్యేకతలని తెలిపారు. వేలాది మందికి కోవిడ్ ఒకటి, రెండవ దశల పరీక్షలను ఇప్పటికే విజయవంతంగా నిర్వహించామని, ప్రస్తుతం వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ పరీక్షలు కూడా నిర్వహించి రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆరోగ్య సమస్యలకు ముఖ్యంగా కరోనా సంబంధిత వైద్య పరీక్షలు జరిపి రోగులు త్వరగా కోలుకునే చికిత్సలు అందిస్తామన్నారు. విజయవాడ (తూర్పు) ఎం ఎల్ ఏ మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్, ఎన్ ఆర్ ఐ సైన్సెస్ అకాడమీ సెక్రెటరీ డా.మంతెన నరసరాజు వంటి ప్రముఖులు, వైద్య రంగానికి చెందిన పలువురు, నగర పెద్దలు తదితరులు ప్రారంభం నుండి ఇప్పటి వరకు ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందజేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు అధునాతన వైద్యాన్ని అందించాలనే సత్సంకల్పంతో, లాభాపేక్ష లేకుండా  వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *