క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం…

-న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి
-18 సంవ‌త్స‌రాలు పైబ‌డి వారికి వ్యాక్సిన్ డ్రైవ్‌
-నేటికి 8,61,237 మంది వ్యాక్సిన్ -ఇంటింటి ఫీవర్ సర్వే 23వ రౌండ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం వైఎస్ జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి నేతృత్వంలో క‌రోనా ప‌రిస్థితుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటోంద‌ని న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి తెలిపారు. క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌, నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు, క‌రోనా నియంత్ర‌ణ‌కు న‌గ‌ర పాల‌క సంస్థ‌ అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు మేయ‌ర్ తెలిపారు. విజ‌య‌వాడలో జ‌న‌వ‌రి నెల‌లో సీఎం చేతుల మీదుగా గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రి నందు వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రంట్‌లైన్ వ‌ర్క్స్‌, ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ, 45 సంవ‌త్స‌రాలు నిండిన వారికి కోవిషీల్డ్, కోవాక్సిన్ మొద‌టి డోస్‌గా 6,48,562 మందికి ,మొదటి మరియు రెండోవ డోస్ టీకా కల్పి నేటికి 8,61,237 మందికి వ్యాక్సిన్ వేయ‌డం జ‌రిగింద‌న్నారు. మూడో ద‌శ క‌రోనాపై ఇప్ప‌టికే సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని స‌న్న‌ద్దం చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సినేష‌న్ ద్వారా ర‌క్ష‌ణ క‌ల్పించి, త‌గు చికిత్స‌లు అందించాల‌ని అదేశించ‌డం అయింద‌ని, అందులో భాగంగా ఈ నెల 23 నుంచి 18 సంవ‌త్స‌రాలు పైబ‌డి 45 సంవత్సరాల లోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయ‌డం ప్రారంభించ‌డం జ‌రిగిందన్నారు. దీనికై న‌గ‌రంలోని వార్డు స‌చివాల‌యాలు, ముఖ్య‌మంత్రి ఆరోగ్య కేంద్రాల‌ల్లో వ్యాక్సిన్ కార్యక్రమము ప్రారంభించినట్లు, క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే శాశ్వ‌త మార్గం అని, యువ‌త స‌హ‌క‌రించాల‌ని పిలుపునిచ్చారు.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందన్నారు. నగర పరిధిలో 18 సంవత్సరాల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ అందించాల‌నే ల‌క్ష్యంతో వార్డ్ సచివాలయాలు, అర్బన్ హెల్త్ సెంటర్ లలో మొదటి డోస్ గా కోవిషిల్డ్ వ్యాక్సిన్ అందిస్తున్న‌ట్లు వివ‌రించారు. ఆందరూ సద్వినియోగ పరచుకోవాలన్నారు.

ఇంటింటి ఫీవర్ సర్వే 23వ రౌండ్‌
కరోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌లో భాగంగా హెల్త్ సెక్ర‌ట‌రీలు వార్డు ప‌రిధిలో కోవిడ్ ప‌రిక్ష‌లు విధిగా నిర్వ‌హించ‌డంతో పాటుగా ఇంటింటి ఫీవర్ సర్వేను నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.. న‌గ‌రంలో ఇప్ప‌డు 23వ రౌండ్‌ ఇంటింటి పివర్ సర్వే జ‌రుగుతుంద‌న్నారు. ఇందుకోసం ఆశ వర్కర్ల, ANM సచివాలయ వాలంటరీలు ఇంటింటి ఫీవర్ సర్వే చేయ‌డంతో పాటు ప్రజలకు కరోనా వైరస్ గురించి అవగాహనా కల్పిస్తూ తగు సలహాలు సూచనలు ఇస్తున్నారని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *