Breaking News

అభివృద్ధే లక్ష్యం… ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
– రూ. 20 లక్షలతో 9వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
నగారాభివృద్ధే లక్ష్యంగా… ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాము, తమ కూటమి ప్రభుత్వం పని చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జేఎన్ రోడ్డు వాకర్స్ రోడ్డులోని 4వ వీధిలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం కోసం రూ. 20 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పర్యాయ పదంగా నిలుస్తుందని, ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా జరుగుతున్న అభివృద్ధి పనులే అందుకు నిదర్శనం అని అన్నారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని అన్నారు. నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజల ఆలోచనలకు తగ్గట్టు వారికి ఏ అభివృద్ధి కావాలో ఆ పనులు మాత్రమే చేయడం జరుగుతోందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు రూ. 250 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. నగరాభివృద్ధే ధ్యేయంగా తాము పని చేస్తున్నామన్నారు. రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రోడ్లు కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జెఎన్ రోడ్డు వంటి ప్రధాన మార్గాల్లోనే అవసరం లేక పోయినా డివైడర్లు, ఫుట్ పాత్ లు నిర్మించారని మిగిలిన ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల్లో తాము మార్పు చేసి చూపించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. రాజమండ్రి నగర ప్రజల 15 ఏళ్ళ కల సాకారం చేసేందుకు గోదావరి గట్టున రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నాయన్నారు. నగరంలోని 35 పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం తాము కృషి చేస్తున్నామన్నారు. ఏది ఏమైనా గ్రీన్ రాజమండ్రి – ఆరోగ్య రాజమండ్రిని ప్రజలు త్వరలోనే చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్కుల అభివృద్ధి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాజమండ్రి చరిత్ర భవిష్యత్తులో నిలిచిపోయేలా కూటమి అభివృద్ధి పనులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *