-1100 కాల్ సెంటర్, వాట్సాప్ గవర్నెన్స్ (9552300009) ద్వారా సేవలు
– కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం ఆగస్టు 4 సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ లో పాల్గొనడం జరుగు తుందని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లోనే సమర్పించవచ్చు అని తెలిపారు. సమస్య పరిష్కారానికి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా అధికారుల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అయ్యేలా చేస్తుందన్నారు. అర్జీలను ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు స్వీకరిస్తారన్నారు. ప్రజలు “మీ కోసం” కాల్ సెంటర్ నంబర్ 1100 ద్వారా ఫిర్యాదులు నమోదు చేయవచ్చు అదే విధంగా ఇప్పటికే నమోదు చేసిన ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చు అనీ తెలియ చేశారు వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ద్వారా పౌర సేవలు పొందవచ్చునని కలెక్టర్ తెలిపారు. ఈ నంబర్‌ను తమ సెల్ ఫోన్లలో సేవ్ చేసుకోవాలని సూచించారు. అంతేకాక, నేరుగా వెళ్లలేని వారు meekosam.ap.gov.in పోర్టల్ ద్వారా కూడా ఆన్లైన్లో అర్జీలు నమోదు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వినూత్న మాధ్యమాలను ఉపయోగించి తమ సమస్యలను పరిష్కరించు కోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు.
Prajavartha Online Telugu News