Breaking News

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కార సాధనకు కృషి.

– ఆర్టీసీ కార్మికులకు ఏపీ ఎన్జీజీఓ నిరంతర సహకారం
-ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం అడుగులు కలుపుతాం.
– ఎన్ ఏమ్ యు రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి సంపూర్ణ సహకారం
-ఏపీ ఎన్జీజీఓ నేతలు ఎ .విద్యాసాగర్, డి.వి. రమణ

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం తో పాటు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్జీజీఓ సంఘం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. తాడేపల్లి లోని ఆర్టీసీ ఎన్.ఎం.యు.ఏ. రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పివి రమణారెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో విద్యాసాగర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉండటమే ప్రధాన బలమన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం ఎన్ఎంయుఏ చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఏపీ ఎన్జీజీఓ సంఘం కలిసి నడుస్తుందన్నారు. ప్రభుత్వం తలపెట్టే ప్రతి సంక్షేమ పథకం అమలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వానికి సహకరిస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. సంఘం రాష్ట్ర కార్యాలయ నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఏపీ ఎన్జీజీఓ, APJAC సిద్ధంగా ఉందన్నారు. గత నాలుగు ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఆర్థిక, ఆర్థిక సమస్యలను సుదీర్ఘ కాలం పాటు పొడిగించకుండా పరిష్కారం కోసం నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. PRC కమిటీ ఏర్పాటు, DA ల మంజూరు, బకాయిల చెల్లింపుగా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో గత నాలుగేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతులను పున ప్రారంభించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో 8000 పైగా ఉన్న ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఇటీవల ఆర్టీసీలో ప్రవేశపెడుతున్న విద్యుత్ బస్సులను ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ సంస్థ కొనుగోలు చేయాలన్నారు వాటిలో ప్రభుత్వమే కార్మికులను నియమించాలన్నారు.. ప్రస్తుతం విద్యుత్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిస్తున్న విధానం పునః సమీక్షించాలన్నారు. గత ప్రభుత్వం నిలిపివేసిన స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ స్కీమ్స్ విధానాన్ని ప్రభుత్వం సమీక్షించి లోటుపాట్లను సవరించి మళ్లీ అమలు చేయాలన్నారు. ఎన్.ఎం.యు.ఏ. రాష్ట్ర అధ్యక్షులు పీవీ రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పాటు అయిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా “మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం” పథకాన్ని దిగ్విజయంగా అమలు చేసేందుకు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ బస్సు డిపోలలో ఉన్న గ్యారేజీలను ఆధునికీకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఎన్.ఎం.యు.ఏ. ప్రధాన కార్యదర్శి వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి రాజేష్ కుమార్,
ఉపాధ్యక్షులు శ్రీనివాసరాజు, సూర్యచంద్రరావు, పీవీ శివారెడ్డి, ఎన్.వి. రమణ, ఎన్. భాస్కర నాయుడు తదితరులతో సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *