Breaking News

తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో టెర్రకోట & పొటరీ వారితో సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తంబళ్లపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ ఆధ్వర్యంలో తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో టెర్రకోట & పొటరీ వారితో సమావేశం జరిగింది. సమావేశం కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ని విశ్వం కాలేజ్ సర్కిల్ వద్ద ఘన స్వాగతం పలికారు. మండల అధికారులు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలసి టెర్రకోట హస్తకళా వస్తువులను పరిశీలించారు. అనంతరం డా.పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ఉత్పత్తి దారులకి ఉన్న సమస్యలను తెలుసుకొని వాహనదారులు నేషనల్ హైవే మార్గం ద్వారా వెళ్ళడం హస్త కళా వస్తువుల మార్కెటింగ్ ట్రాన్స్ పోర్ట్ వారి సమస్యల కచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హస్తకళా కార్మికుల కోసం హైవే మీద స్థలాన్ని కేటాయించి దానిలో రూమ్లు స్టాల్స్ మరియు షెడ్ నిర్మిస్తామని స్థానిక ఎమ్మార్వో ని మరియు ఎండివో ని మరియు సంబంధిత శాఖ అధికారులను వెంటనే స్థల పరిశీలన చేయవలసిందిగా మరియు నిధులు ఎస్టిమేషన్ వేయాల్సిందిగా తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ అక్కడ నుండి అంగళ్లు వద్ద టెర్రకోట హస్తకళా వస్తువుల ఉత్పత్తి దారులతో డా.పసుపులేటి హరిప్రసాద్, తంబళ్లపల్లె జనసేన ఇంచార్జి పోతుల సాయినాథ్, జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, AMC చైర్మన్ జంగాల శివరామ్ రాయల్, రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్ దారంఅనిత, పద్మశాలి చైర్మన్ ఈశ్వరయ్య, పుంగునూరు జనసేన పార్టీ ఇంచార్జ్ చిన్న రాయల్, తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జి జయచంద్ర రెడ్డి, తంబళ్లపల్లె అబ్జర్వర్ సీడ్ మల్లికార్జున నాయుడు, చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, మదనపల్లి సీనియర్ నాయకులు తోట కళ్యాణ్, బాలసముద్రం ఎంపీటీసీ అమర్ కార్తికేయ, నిమ్మనపల్లి మండల అధ్యక్షుడు ప్రదీప్ సింగ్, మండల అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

 

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *