రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో 157 అర్జీలు స్వీకరణ – 952300009 వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు
ఆన్‌లైన్‌లో నమోదు అయ్యే అర్జీలపై సత్వర చర్యలు తీసుకోవాలి కలెక్టర్ పి. ప్రశాంతి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోందని, అర్జీలను నిర్ణీత గడువులో నాణ్యతతో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, అర్జీదారుల సమస్యలను ఓర్పుతో విని, మర్యాదపూర్వకంగా స్పందించాలని సూచించారు. పరిష్కరించగల అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించలేని వాటికి కారణాలు వివరించి అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. మండలాల వారీగా రోజువారీగా ఫిర్యాదుల పరిష్కార తీరును సమీక్షించాలన్నారు. గ్రీవెన్స్ ఎక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి అర్జీపై ఎండోర్స్‌మెంట్ తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ఈరోజు మొత్తం 157 అర్జీలు స్వీకరించగా, వాటిలో రెవెన్యూ – 71, పంచాయతీ రాజ్ – 43, విద్యుత్ – 7, పాఠశాల విద్య – 5, పోలీస్, పురపాలక తదితర శాఖలు – 31 ఉన్నాయి. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి, సిపివో ఎల్. అప్పలకొండ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News