Breaking News

పీజీఆర్‌ఎస్ – మీ కోసం”లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

– డివిజనల్ పరిపాలన అధికారిణి యం. సుజాత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు 1100 కాల్ సెంటర్ నంబర్‌కు ఫిర్యాదులు తెలపవచ్చు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీపై సమయానుకూలంగా చర్యలు తీసుకొని, దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని డివిజనల్ పరిపాలన అధికారిణి యం. సుజాత అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన “పీజీఆర్‌ఎస్ – మీ కోసం” కార్యక్రమంలో, ఆర్డీఓ తరపున డివిజన్ స్థాయి అధికారులతో కలిసి ఆమె 7 అర్జీలను స్వీకరించారు. నిర్దేశిత గడువులో ప్రతి అర్జీని పరిష్కరించాలన్నారు.

ఈరోజు వచ్చిన కొన్ని అర్జీలు:
రాజానగరం మండలం, కలవచర్ల గ్రామం: ఇంటి పైగా ఉన్న కరెంటు తీగలను తొలగించాలన్న విజ్ఞప్తి – టి. త్రిమూర్తులు. రాజానగరం మండలం, పతంగపాడు గ్రామం: భూమిని రీ-సర్వే చేసి అప్పగించాలన్న అభ్యర్థన – వి. కృష్ణవేణి. కోరుకొండ మండలం, నర్సాపురం గ్రామం: నీటి కొరత సమస్య పరిష్కరించాలన్న వినతి – సిహెచ్. రాజారత్నం. కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *