-టిడిపి,జనసేన ఎంపీలతో కలిసి స్వాగతం పలికిన ఎంపీ కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఢిల్లీకి విచ్చేసిన రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం తొలిసారిగా తెలుగుదేశం పార్లమెంటు పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. ఈసందర్భంగా సహచర టిడిపి, జనసేన ఎంపీలతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ స్వాగతం పలికారు. అలాగే కేంద్ర పౌర విమానాయశ శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీ కృష్ణదేవరాయలు మంత్రి నారాలోకేష్ కి స్వాగతం పలికటంతో శాలువాతో ఘనంగా సత్కరించారు.
Prajavartha Online Telugu News