-రిక్షా ఆటో రిక్షా ఆటోనగర్ కార్మిక, బలహీనుల పక్షాన పోరాడిన యోధుడు వంగవీటి రంగా-చందు జనార్ధన్ రాష్ట కాపు జే ఏ సీ అధ్యక్షులు
రామచంద్రపురం/తల్లాడ/ఖమ్మం జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాల కతీతం గా పేద ప్రజల సంక్షేమం కోసం పోరాడితే స్వర్గీయ వంగవీటి మోహనరంగా వలె శాశ్వతంగా సమాజం లో నిలిచి పోతారని వంగవీటి రాధా కృష్ణ అన్నారు.ఆదివారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లో రామచంద్రపురం గ్రామం లో అభిమాని సుద నరసింహారావు ఏర్పాటుచేసిన వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని ఆయన తనయుడు వంగవీటి రాధా కృష్ణ ఆవిష్కరించి ప్రసంగించారు.రాజకీయాల్లో కొనసాగే నాయకులు సైతం పేద ప్రజల పక్షాన పోరాడితే రంగా గారి వాలి ప్రజల గుండెల్లో శాశ్వతం గా నిలిచి పోతారని అభిప్రాయ పడ్డారు.స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారు కులాలకతీతంగా పేదల పక్షాన పోరాడారని ఆయన అందరి వాడని రాధా కృష్ణ పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న సత్తుపల్లి శాసన సభ్యులు శ్రీమతి రాగమయి మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా కు ప్రజల్లో ఉన్న ఆదరణ చాలా గొప్పదని పేర్కొన్నారు.వారి తనయుడు రాధాకృష్ణ కు గొప్ప ఆదరణ ఉందని రాజకీయ భవిష్యత్తు కూడా మరిన్ని అవకాశాలు రావాలని కోరారు.ఈ కార్య క్రమం లో పాల్గొన్న రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్ధన్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధులు వంగవీటి మోహనరంగా అని కొనియాడారు.రిక్షా కేర్మికులు,ఆటో రిక్షా కార్మికులు,ఆటోనగర్ కార్మికులు,కూలీల పక్షాన నిలిచిన వంగవీటి మోహన రంగా విజయ వాడ లో పేదల ఇంటి స్థలాల కోసం నిత్యం పోరాడేవారని చందు జనార్దన్ తెలిపారు.ఆయన తనయుడు వంగవీటి రాధా కృష్ణ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ చాలా గొప్పదని ఏ కార్యమాలకి వెళ్ళినా యువత ఆయన వెంట ఉండే అభిమానం వేల కట్ట లేనిదని అన్నారు.మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల గాంధీ అధ్యక్షత వహించగా అక్కల గాంధీ,నంబూరి శ్రీనివాసరావు,కట్టరంగారావు,తాళ్లూరి హనుమంతరావు,సుంకర సాంబశివరావు,కె రాజేంద్ర,బాపట్ల మురళి,హారిక నాయుడు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News