Breaking News

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా అవగాహన కార్యక్రమం

– బోండా ఉమామహేశ్వరరావు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు
– ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం ఉపయోగాలు అందరికీ తెలియాలి- ధ్యానచంద్ర హెచ్ యం, కమిషనర్, విజయవాడ నగర పాలక సంస్థ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ఉపయోగపడే కేంద్ర, రాష్ట్ర పథకాలు ప్రజలకు అవగాహన కల్పించాలన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పిలుపుమేరకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం ఆధ్వర్యంలో గురువారం ఉదయం గవర్నర్పేట, ఐ వి పాలస్ లో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అధికారులు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ఐదు నుంచి పదిలక్షల ఇళ్ళు శౌర్యశక్తితో ఉండాలని సంకల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు విజయవాడ సెంట్రల్ ప్రజలకు సూర్యఘర్ ద్వారా కలిగే ప్రయోజనాలను తెలపాలని, రూఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పధకం వర్తిస్తుందని, వారికి ఈ పథకంలో దరఖాస్తు చేసుకునేందుకు సహాయపడాలని, కరెంటు మీటర్ సామర్థ్యం బట్టి వారికి ఎంత విద్యుత్ కెపాసిటీ అప్లై చేసుకోవచ్చని, ఈ పథకం వల్ల విద్యుత్ మరియు డబ్బు ఆదా అవుతుందని, వారికి అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలని, ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాయితీ లభిస్తుందని, బ్యాంకు రుణ సదుపాయం వంటి లాభాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.

ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం ప్రజలకు పూర్తిస్థాయిలో తెలపాలని సూర్యశక్తి ద్వారా విద్యుత్ ను మనం ఎంత ఉత్పత్తి చేయొచ్చు, వాటి ద్వారా కలిగే లాభాలు, ప్రభుత్వం కల్పించే సబ్సిడీ, వారికి ఉపయోగపడే అంశాలన్నీ వాళ్లకు అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని, రీసోర్స్ పర్సన్లు, వార్డ్ వెల్ఫేర్ సెక్రెటరీలు, ప్లానింగ్ సెక్రటరీలు, సమన్వయంతో, ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, జోనల్ కమిషనర్ కే.ప్రభుదాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి. వెంకటనారాయణ, చీఫ్ సిటీ ప్లానర్ కే సంజయ్ రత్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *