Breaking News

దేశంలో నెలకొన్న పరిస్థితులు యువత అనుసరించాల్సిన విధానాలు…

ఏలూరు,  నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువభారత్ ( మై భారత్) ఆధ్వర్యంలో గురువారం ఏలూరులోని సర్ సి.ఆర్.ఆర్. అటానమాస్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై జిల్లా సెట్వెల్ అధికారి ప్రభాకర్ అవగాహన కల్పిస్తూ ఈరోజు దేశంలో నెలకొన్న పరిస్థితులు యువత అనుసరించాల్సిన విధానాలను వివరించారు. సిఆర్ రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ రామరాజు మాట్లాడుతూ కెరీర్ గురించి చెప్పాలి అంటే యువత దుర్వేసనాలకు బానిసలు కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మేరా యువ భారత్ అధికారి సుంకర రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల అందరికీ అవగాహన ఉండాలని ముఖ్యంగా యువత క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు స్టార్టప్ కంపెనీలు ద్వారా అభివృద్ధి చెందాలనె లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అవగాహన కల్పిస్తుందన్నారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి జితేంద్ర మాట్లాడుతూ మై భారత్ ద్వారా నిర్వహించే కార్యక్రమాలు యువత భవిష్యత్తు కు ఎంతో గానో ఉపయోగపడతాయని చెప్పారు. ప్రధానంగా విద్యతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాల ద్వారా వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు జిల్లా ఉపాధి కల్పన అధికారి వి వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు తాము చదివే ఉద్యోగ సంబంధించిన వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి అని చెప్పారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *