విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టుల బహుళ అంతస్థుల హౌసింగ్ ప్రాజెక్ట్ అంశం మంత్రివర్గ ఉపసంఘంలో పెడతామని సిఆర్డీఎ కమిషనర్ కన్నబాబు తెలిపారు. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు సిఆర్డీఎ కమిషనర్ ను ఆయన కార్యాలయంలో గురువారం కలిశారు. ఈ సందర్భంగా గత తెలుగుదేశం ప్రభుత్వం బహుళ అంతస్తుల హౌసింగ్ ప్రాజెక్ట్ నిమిత్తం మందడంలో 30 ఎకరాలు కేటాయించిన భూమి వివరాలు సర్వే నెంబర్లతో కూడిన ఎలాట్ మెంట్ లెటర్ ను కమిషనర్ కి అందచేయడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19 మధ్య కాలంలో జర్నలిస్ట్ లకు అమరావతిలో ప్రతిపాదించిన హౌసింగ్ ప్రాజెక్ట్ ను తిరిగి అమలు చేయాలని వినతి పత్రాన్ని కూడ అందచేసిన జర్నలిస్టులు.
అమరావతిలో జర్నలిస్టుల కోసం గత టీడీపీ ప్రభుత్వంలో భూమి కేటాయించగా తదుపరి ప్రభుత్వం మారడంతో ప్రాజెక్ట్ అమలు నిలిచిపోయిందని వివరించిన జర్నలిస్ట్ లు. తిరిగి ప్రాజెక్ట్ ను కొనసాగించి ప్రభుత్వమే బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని వినతి. ఈ మేరకు గతంలో ప్రభుత్వం కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగిందని ఇందుకు ప్రతిగా ప్రభుత్వం కొంత రాయితీతో హ్యాపీ నెస్ట్ మోడల్ లో నిర్మిస్తామన్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతులను కమిషనర్ కి అందచేసిన ప్రతినిధులు. ఇందుకు నాలుగు కేటగిరీలు గా నిర్మాణం జరిపేందుకు ముఖ్యమంత్రి కూడ అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే ఒక మోడల్ జర్నలిస్ట్ కాలనీ నిర్మించాలని అధికారులను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఇటీవలే మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ని కలిసి వివరించగా ఆయన కూడ సుముఖంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారని
వివరించటం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ స్ఫందిస్తూ మంత్రివర్గ ఉపసంఘంలో పెడతామని తెలిపారు. కమిషనర్ కన్నబాబు ని కలిసిన వారిలో అమరావతి జర్నలిస్ట్ హౌసింగి సొసైటీ కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనివాసరావు, సొసైటీ డైరక్టర్ చావా రవి, సీనియర్ జర్నలిస్ట్ దారం వెంకటేశ్వరరావు, ప్రెస్ ఫోటో గ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు సాంబశివరావు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News