విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం ప్రభుత్వము మైనారిటీల అభ్యున్నతి కోసము 1994 లో సెంటర్ అఫ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) ను స్తాపించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రస్తుతము కర్నూల్, గుంటూరు మరియు విశాఖపట్నములలో మూడు ప్రాంతీయ కార్యాలయాలు కూడా నిర్వహించబడుతున్నాయి. కేంద్ర స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో భర్తీ చేయు ఉద్యోగాలకు జరగబోయే పోటి పరిక్షల కోసము సంసిద్దమయ్యే మైనారిటీ విద్యార్ధులకు, ప్రముఖ కోచింగ్ సెంటర్లలో ఉన్న నైపుణ్యమైన సిబ్బంది ద్వారా కోచింగ్ ఇవ్వడము జరుగుతుంది. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వము విడుదల చేసిన మెగా DSC (16,347 ఉద్యోగాలతో) పరీక్షలకు ఈ సంస్థ ద్వారా 1780 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందులో 1200 మందికి పైగా అర్హత మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాదించారు. 152 మంది వివిధ జిల్లాలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరై ఉద్యోగాల్లో చేరేందుకు సిద్దముగా ఉన్నారు. మన యన్.టి.ఆర్.జిల్లాలో 13 మంది మైనారిటీ విద్యార్ధులు CEDM ద్వారా శిక్షణ పొంది DSCలో ఉద్యోగాలు పొందారు. త్వరలో ఈ 13 మందికి మైనారిటీ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ద్వారా సన్మాన కార్యక్రమము ఉంటుంది. ఈ సందర్భముగా తెలియజేయునది ఏమనగా, CEDM మరింత సమర్దవంతముగా నిర్వహించేందుకు, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎక్కువ మందికి సులభముగా సేవలు చేరేందుకు ఆన్లైన్లో కూడా కోచింగ్ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విధముగా మైనారిటీల సంక్షేమానికి ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వము కట్టుబడి వుందని మరోసారి సగర్వముగా చెబుతున్నాము.
Tags vijayawada
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News