
-ఆహ్వాన పత్రిక అందజేసిన ఎంపీ కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ కు విచ్చేయాల్సిందిగా రాజ్య సభ ఎంపీ సానా సతీష్ బాబు, అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగిలను విజయవాడ ఉత్సవ్ కమిటీ సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్ ఆహ్వానించారు. ఢిల్లీలో శనివారం ఎంపీల నివాసంలో వారిని కలిసి విజయవాడ ఉత్సవ్ ఆహ్వాన పత్రిక అందజేశారు. విజయవాడ సాంస్కృతిక విలువలను ప్రోత్సహిస్తూ స్థానిక సంప్రదాయాల వైభవాన్ని దేశ వ్యాప్తంగా పరిచయం చేయటమే విజయవాడ ఉత్సవ్ లక్ష్యమని వారికి ఎంపీ కేశినేని శివనాథ్ వివరించారు. విజయవాడ ఉత్సవ్ నగరానికే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే వేదికగా నిలవనుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ ఉత్సవ్ కు తప్పనిసరిగా హాజరవుతామని ఎంపీలు ఇరువురు ఎంపీ కేశినేని శివనాథ్ కు తెలిపారు.
Prajavartha Online Telugu News