-ఆహ్వాన పత్రిక అందజేసిన ఎంపీ కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో దసర శరన్నవరాత్రులకు మరింత శోభ తెచ్చేందుకు నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ కు విచ్చేయాల్సిందిగా కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజ శ్రీనివాస వర్మను విజయవాడ ఉత్సవ్ కమిటీ సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్ ఆహ్వానించారు. ఢిల్లీలో శనివారం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ నివాసంలో ఆయన్ను కలిసి విజయవాడ ఉత్సవ్ ఆహ్వాన పత్రిక అందజేశారు.
కేంద్ర మంత్రి భూపతిరాజ శ్రీనివాస వర్మను ఎంపీ కేశినేని శివనాథ్ శాలువాతో సత్కరించారు. విజయవాడ ఉత్సవ్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఎంపీ కేశినేని శివనాథ్ ను కేంద్రమంత్రి శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు అమరావతి రాజధాని ప్రాంతంలో భాగమైన విజయవాడ నగర పర్యాటక, సాంస్కృతి, చారిత్రక, అధ్యాత్మిక వైభవాన్ని దేశ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు విజయవాడ ఉత్సవ్ వేదిక కానుందని ఎంపీ కేశినేని శివనాథ్ వివరించారు.. సెప్టెంబర్ 22 వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలు విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖ, సోసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు వివరించారు. విజయవాడ ఉత్సవ్ తో సాంస్కృతిక పునాదులు మరింత బలపడతాయని అభిప్రాయపడిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఈ ఉత్సవ్ కు తప్పనిసరిగా హాజరవుతానని తెలిపారు.
Prajavartha Online Telugu News