-పెన్ ఓ పీలియా పెన్ షో ను ప్రారంభించిన కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అందరి జీవితాల్లో కలాలు ఒక భాగంగా మారిపోయాయి. పుస్తకం ఏమి రాయలన్నా కలం లేకుండా కుదరదు.. పిలల్లోనే కాదు యువతలో కూడా రచనా, సృజనాత్మకత పెంపొందించేందుకు కలాలు మంచి నేస్తాలని కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ అన్నారు. విజయవాడ పీవిపీ మాల్ రోడ్ లోని వి.హెచ్.ఎమ్. గ్యాలరీలో ఏర్పాటు చేసిన పెన్ ఓ పీలియా పెన్ షో కి శనివారం ముఖ్యఅతిథిగా హాజరైన కేశినేని వెంకట్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. వి.హెచ్.ఎమ్. ట్రేడర్స్ నిర్వాహకులు హరీష్ దేశాయ్,అనిక్త, వియెన్ దేశాయ్, ముఖేష్ యెన్ దేశాయ్ లతో కలిసి షీఫర్ పెన్ ను విడుదల చేసారు. అనంతరం ఈ ప్రదర్శనలోని వివిధ రకాల పెన్నులను కేశినేని వెంకట్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కేశినేని వెంకట్ మాట్లాడుతూ మాట్లాడుతూ కలాలు ప్రదర్శనతో పాటు చిన్నపిల్లలకు చేతి రాత పోటీలు నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. అలాగే చేతి రాత మంచి రాయటానికి కూడా నిపుణులతో చిన్నారులకు సలహాలు, సూచనలు అందించే ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని సూచించారు. ఈ పదర్శనలో వుంచిన పెన్ లన్నీ బాగున్నాయన్నారు. పెన్ కలెక్షన్ హాబీ వున్న వాళ్లకి ఎంతో ఉపయోగం వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News