Breaking News

కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహ‌న్ నాయుడుకు విజయవాడ ఉత్సవ్ ఆహ్వానం

-ఆహ్వాన ప‌త్రిక అంద‌జేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ‌ సాంస్కృతిక వైభవాన్ని చాటే విజ‌య‌వాడ‌లో సెప్టెంబ‌ర్ 22వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు జ‌రిగే విజయవాడ ఉత్సవ్‌కు విచ్చేయాల్సిందిగా కేంద్ర పౌర విమానాయ‌న శాఖ మంత్రి కె.రామ్మోహ‌న్ నాయుడును విజ‌య‌వాడ ఉత్స‌వ్ క‌మిటీ స‌భ్యులు ఎంపీ కేశినేని శివ‌నాథ్, రాజ్య‌స‌భ ఎంపీ సానా స‌తీష్ బాబుతో క‌లిసి ఆహ్వానించారు. ఢిల్లీ శ‌నివారం కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు కార్యాల‌యంలో ఆయ‌న్ను క‌లిసి విజ‌య‌వాడ ఉత్స‌వ్ ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు. విజ‌య‌వాడ‌ సాంస్కృతిక విలువలను ప్రోత్సహిస్తూ, స్థానిక సంప్రదాయాల వైభవాన్ని దేశవ్యాప్తంగా పరిచయం చేయడం ఈ ఉత్సవ లక్ష్యమని ఎంపీ కేశినేని శివ‌నాథ్ వివ‌రించారు.. సమాజంలోని ప్రతి వర్గాన్నీ కలుపుకుంటూ నిర్వ‌హించే విజ‌య‌వాడ ఉత్స‌వ్ కి ఖ‌చ్చితంగా వ‌స్తానని ఎంపీ కేశినేని శివ‌నాథ్ కి కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *