విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా ఈరోజు నిర్వహించిన “క్రౌన్ ఆఫ్ విజయవాడ” ఈవెంట్ ఆడిషన్లలో 300 మందికి పైగా ప్రతిభావంతులు పాల్గొన్నారు.
ఈ ఆడిషన్లలో కింది విభాగాలలో పాల్గొన్నారు:
కిడ్స్ కేటగిరీ
టీన్స్ కేటగిరీ
మిస్ కేటగిరీ
మిసెస్ కేటగిరీ
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లలో కూడా 200 మందికి పైగా ఆసక్తి చూపారు. ప్రతి కేటగిరీ నుండి 25 మందిని ఎంపిక చేయనున్నారు.
ఎంపికైన వారికి సెప్టెంబర్ 21, 22, 23 తేదీలలో ప్రత్యేక శిక్షణా తరగతులు (ట్రైనింగ్ సెషన్లు) ఏర్పాటు చేయబడతాయి. అనంతరం, 24న టాలెంట్ రౌండ్ & సెమీ ఫైనల్స్ జరుగుతాయి. మన సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబొట్టు ప్రతిబింబించేలా గ్రాండ్ ఫినాలే సెప్టెంబర్ 25న పున్నమి ఘాట్‌లో ఘనంగా నిర్వహించబడుతుంది అని షో డైరెక్టర్ సతీష్ అద్దాల గారు తెలిపారు.
ట్రైనింగ్ సెషన్లు:
మిస్ & మిసెస్ → సెప్ 21, 22, 23 | ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 వరకు
కిడ్స్ → సెప్ 23 | మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 వరకు
వేదిక: సన్ స్క్వేర్ హోటల్, గాంధీనగర్, విజయవాడ
టాలెంట్ రౌండ్ & సెమీఫైనల్స్
సెప్టెంబర్ 24, 2025
మిస్ & మిసెస్ → ఉదయం 10 – మధ్యాహ్నం 2
కిడ్స్ → మధ్యాహ్నం 2 – సాయంత్రం 5
శ్రీరామ్ ఫంక్షన్ హాల్ (ఇలాపురం హోటల్ ఎదురుగా, విజయవాడ)
గ్రాండ్ ఫినాలే
సెప్టెంబర్ 25, 2025 | సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఎక్స్పో గ్రౌండ్స్, గోల్లపూడి
Prajavartha Online Telugu News