Breaking News

శ్రీవారి గరుడసేవ ఏర్పాట్లను పరిశీలన

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీవారి గరుడసేవ నిమిత్తం భారీగా భక్తులు విచ్చేసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ సి.ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, టిటిడి సివి & ఎస్‌ఓ మురళీకృష్ణ, ఐపీఎస్ తిరుమలలో సంయుక్తంగా పర్యటించారు. ఔటర్ రింగ్ రోడ్లు, నాలుగు మాడ వీధులు సహా ప్రధాన ప్రాంతాలను తిరిగి, భక్తుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా, క్రమశిక్షణతో క్యూలైన్లు నిర్వహించాలి అని సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు, అత్యవసర వాహనాలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. ఫైర్ సర్వీసులు, 108 మెడికల్ టీంలు, అంబులెన్సులు, తాగునీటి సదుపాయాలు, సహాయక కేంద్రాలు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణను బలోపేతం చేసి, అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలీస్ సిబ్బందిని మోహరించాలని ఆదేశించారు. వాలంటీర్లు, అంకితభావంతో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి ప్రజలతో మర్యాదగా, సహాయకరంగా ఉండాలని కూడా సూచించారు.

అధికారులు పేర్కొన్నది
“భక్తుల భద్రత మా ప్రధాన ప్రాధాన్యత. ఈ రోజు గరుడసేవలో లక్షలాది మంది భక్తులు పాల్గొనబోతున్నారు. ఎవరూ ఇబ్బందులు పడకుండా, ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి” అని జిల్లా కలెక్టర్, ఎస్పీ, టిటిడి సివి & ఎస్‌ఓ తెలిపారు. భక్తులు కూడా ఈ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించడం వల్ల తమకు మరింత నమ్మకం కలుగుతోందని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *