Breaking News

గురుకుల పాఠశాలను తరలించొద్దని వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానిపురం, ఐరన్ యార్డు నందు గల ఏపీ గురుకుల పాఠశాలను ఆగిరిపల్లి కు తరలించవద్దని కోరుతూ పేరెంట్ కమిటీ చైర్మన్ ఎస్ మహాలక్ష్మి, పేరెంట్ కమిటీ ఉపాధ్యక్షులు రామకృష్ణ , పేరెంట్ కమిటీ సభ్యులతో కలిసి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ తో కలిసి ఐరన్ యార్డు నందు గల గురుకుల పాఠశాలను సందర్శించారు. 211 మంది బాలికలు ఉన్న గురుకుల పాఠశాలను ఆగిరిపల్లి మండలం , ఈదర గ్రామానికి తరలించడం వలన ఆ ప్రాంతంలో సరైన భద్రత లేదని వారు వాపోయారు.

మౌలిక సదుపాయాలు లేని ఆ ప్రాంతంలో విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులు కూడా అనేక ఇబ్బందులు పడతారని సంబంధిత అధికారులతో మాట్లాడి తరలింపును ఆపాలని పేరెంట్ కమిటీ సభ్యులు తెలిపారు. సురక్షిత ప్రాంతంలో అన్ని సౌకర్యాలు ఉన్న ఐరన్ యార్డులోనె గురుకుల పాఠశాలను కొనసాగించేలా చేయాలని ఎమ్ ఎస్ బేగ్, ప్రత్తిపాటి శ్రీధర్ కు పేరెంట్ కమిటీ చైర్మన్ ఎస్ మహాలక్ష్మి, పేరెంట్ కమిటీ ఉపాధ్యక్షులు రామకృష్ణ సూచించారు. విద్యార్థులు, తల్లితండ్రులు , పేరెంట్ కమిటీ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని , ఎవరికి సమాచారం ఇవ్వకుండా గురుకుల పాఠశాలను తరలించడం సరైన పద్ధతి కాదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ పాఠశాల జాయింట్ సెక్రెటరీ ఉబెదుల్లా కి సూచించారు.

ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లి గురుకుల పాఠశాలలోని సమస్యలను పరిష్కరిస్తామని ఎం ఎస్ బేగ్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. గురుకుల పాఠశాల తరలింపును ప్రస్తుతానికి ఆపాలని సంబంధిత అధికారులకు సూచించారు. నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ బెవర సాయి సుధాకర్, టీడీపీ నేతలు తారిఖ్ అజీజ్, బూర కనకరావు, బంకా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *