Breaking News

గాంధీ హిల్ పునర్వైభవానికి కృషి..

-ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం
-విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, సెప్టెంబర్ 28: విజయవాడ నగరాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గాంధీ హిల్ పునర్వైభవానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో గాంధీ హిల్ పై జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం ఆయన గాంధీ హిల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కేపీసీ గాంధీ, వైస్ చైర్మన్ జంద్యాల శంకర్ తో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన చిన్నతనంలో విజయవాడ గాంధీ హిల్ దేశంలోనే రెండో ప్లానిటోరియంగా ఉండేదని, కొన్నేళ్లుగా దీని పర్యవేక్షణ విస్మరించడంతో రూపు కోల్పోయిందని అన్నారు. విజయవాడ నగరానికి కృష్ణానది, ఇంద్రకీలాద్రి, కొండపల్లి బొమ్మలు, మూడు కాలువలు ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని, ప్రజలు ఆస్వాదించేలా గాంధీ హిల్ తీర్చిదిద్దుతామని ఎంపీ తెలిపారు. ఏ ఇజం లేదు.. ఓన్లీ టూరిజం.. అని ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకొని విజయవాడ నగరాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎంపీ వివరించారు. అవసరమైతే గాంధీ హిల్ అభివృద్దికి ఎంపీ నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

గాంధీ హిల్ అభివృద్ది కమిటీ చైర్మన్ కెపిసి గాంధీ మాట్లాడుతూ గాంధీ హిల్ ను నాలుగు దశల్లో అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రీసెర్చ్ స్కాలర్స్ ఇక్కడికి వచ్చి మహాత్ముని జీవన విధానంపై రీసెర్చ్ చేయడానికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నామని, దీనిలో భాగంగా 100 గదులతో కూడిన గెస్ట్ హౌస్ నిర్మించాలని ప్రసాదించినట్లు పేర్కొన్నారు. గతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా విరాజిల్లిన గాంధీ హిల్ చరిత్రను ఆయన వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *