Breaking News

స్వచ్ఛ ఆంధ్ర సాధన దిశగా జరుగుతున్న మహా యజ్ఞంలో భాగస్వాములు కావాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను బాధ్యతగా పాటిస్తూ స్వచ్ఛ ఆంధ్ర సాధన దిశగా జరుగుతున్న మహా యజ్ఞంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర కార్మికులు కర్మాగారాలు బాయిలర్లు వైద్య బీమా సేవల శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ప్రజలకు పిలుపునిచ్చారు.

సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర పురస్కార ప్రధాన ఉత్సవ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోలం నాగమణిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభా కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని అనే నినాదంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. మన ఆరోగ్యం మన చేతిలో ఉందని స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ పాటిస్తూ స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎంతో అంకితభావంతో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ముందుచూపుతో స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారనీ అభినందించారు. ప్లాస్టిక్ వాడకం చాలా ప్రమాదకరమని క్యాన్సర్ వ్యాధి గురి కావడానికి ఇదే ముఖ్య కారణం అన్నారు. మనం వాడి పడేసిన ప్లాస్టిక్ సంచులలోని ఆహారాన్ని ఆవులు, తదితర జంతువులు తిని అనారోగ్యం పాలవుతున్నాయన్నారు.

జిల్లాలోని చల్లపల్లి గ్రామాన్ని గత 11 సంవత్సరాలుగా పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తున్న డాక్టర్లు బిఆర్కే ప్రసాదు, పద్మావతి లు అభినందనీయులన్నారు. చల్లపల్లి గ్రామంలో ఏ వివాహ వేడుక జరిగిన ప్లాస్టిక్ లేకుండా నిర్వహించడంలో వారు చూపుతున్న చొరవ చాలా గొప్పదన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గించడం అభినందించదగ్గ విషయం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సచివాలయంలో కూడా ప్లాస్టిక్ నీటి సీసాలకు బదులుగా గాజు సీసాలను వాడుతున్నామన్నారు.

ఇటీవల స్వస్థనారీ కార్యక్రమంలో స్క్రీనింగ్ పరీక్షలకు హాజరైనప్పుడు 13 శాతం మంది మహిళలకు క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 69 రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర బహుమతులలో జిల్లాకు 4 బహుమతులు రావడం, జిల్లా స్థాయిలో 44 బహుమతులు రావడం జిల్లాకే గర్వకారణం అన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛత కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరిని సన్మానించాలని రాష్ట్రప్రభుత్వం సంకల్పించి తొలిసారిగా వారికి బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం చేపట్టిందన్నారు. వచ్చే 2047 సంవత్సరాల నాటికి స్వర్ణాంధ్ర సంకల్పానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగానే 10 సూత్రాల పథకాన్ని రూపొందించి అందులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు.

రానున్న 3 నెలల్లో అన్ని మున్సిపాలిటీలలో ఒక కార్యాచరణ ప్రణాళిక ద్వారా స్వచ్ఛత కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టబోతున్నామని వివరించారు. ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా చేతులు కలిపి ఉద్యమం రూపంలో స్వచ్ఛత కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళితే తప్పకుండా విజయవంతం అవుతుందన్నారు. సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరూ పనిచేస్తే సమాజంలో తప్పకుండా మార్పు వస్తుందన్నారు.

చల్లపల్లిలో డాక్టర్లు బిఆర్కే ప్రసాద్, వారి సతీమణి డాక్టర్ పద్మావతి స్వచ్ఛతకు రోల్ మోడల్ గా నిలిచారన్నారు.
ఒకరోజు కాదు 11 సంవత్సరాల పాటు చల్లపల్లి గ్రామాన్ని స్వచ్ఛంగా సుందరంగా తీర్చిదిద్దడంలో వారు చూపిస్తున్న చొరవ కృషి జిల్లాకే గర్వకారణం అంటూ వారిని అభినందించారు.

వారిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ నాగాయలంక, స్వచ్ఛ కూచిపూడి ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు.
ప్లాస్టిక్ వలన రోగాల బారిన పడుతున్నామని ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ను వాడకాన్ని తగ్గించాలన్నారు

గతంలో ఎవరైనా ఇంటి నుండి బయటకు వస్తే తప్పకుండా చేతిలో ఒక సంచి తీసుకు వెళ్లే వారమని పార్సల్ లకు అవసరమైతే స్టీల్ డబ్బాలను తీసుకు వెళ్లే వారమన్నారు. అలాంటి అలవాటును మరలా ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు. కలెక్టరేట్లో త్వరలో ఒక మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతినెల 3 వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాniki సంకల్పించారన్నారు. డాక్టర్ దంపతులు విఆర్కె ప్రసాద్ పద్మావతి చల్లపల్లి గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారన్నారు. వారు చేసే సేవకు విలువ కట్టలేమన్నారు.

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అప్పుడే మనకు రోగాలు రాకుండా రోగ నిరోధక శక్తి పెంపొందుతుందన్నారు.

అనంతరం స్వచ్ఛత కోసం పాటుపడిన ప్రభుత్వం వారిని అభినందిస్తూ శాలువల ప్రశంసా పత్రాలు జ్ఞాపికలతో మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ ఆర్టీసీ చైర్మన్ ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా స్వచ్ఛత అవార్డు గ్రహీతలు బి ఆర్ కే ప్రసాద్, సంతనాల జయలక్ష్మి, ఎన్.కృష్ణవేణి, జయంతి వారి అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు.

అనంతరం మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ ఆర్టీసీ చైర్మన్ స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ అవార్డు గ్రహీతలతో కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కన్నమనాయుడు, డిప్యూటీ సీఈఓ ఆనందకుమార్, మచిలీపట్నం, గుడివాడ, తాడిగడప మునిసిపల్ కమిషనర్లు బాపి రాజు, మనోహర్ రావు, నజీర్, మెప్మా పీడీ సాయిబాబు, డిఆర్డిఏ పిడి హరిహరనాదు, డిఐసి జిఎం వెంకటరావు, డిపిటివో వెంకటేశ్వర్లు, జిల్లా టూరిజం అధికారి రామ్ లక్ష్మణ్, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి తదితర అధికారులు బహుమతి గ్రహీతలు, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *