Breaking News

అర్హులైన పేదలకు కేంద్ర పథకాలు అందించాలి

-అధికారులు చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పేద బడుగు బలహీన వర్గాల ఉన్నతి కొరకు పనిచేయాలి : దిశా చైర్మన్ మరియు తిరుపతి ఎం.పి. గురుమూర్తి
-అర్హులైన పేదలకు, లబ్దిదారులు ప్రజా సంక్షేమ పథకాలు అందించాలి
-దిశా సమావేశానికి గైర్హాజరు అయితే చర్యలు తప్పవు : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన పేదలకు కేంద్ర పథకాలు ప్రజలకు తప్పక అందించాలని, అధికారులు చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పేద బడుగు బలహీన వర్గాల ఉన్నతి కొరకు పనిచేయాలని తిరుపతి ఎం.పి. మరియు దిశా చైర్మన్ ఎం. గురుమూర్తి అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా సమన్వయ అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ (DISHA) సమావేశంలో గతంలో చర్చించిన పలు అంశాలపై తీసుకున్న చర్యలపై సంబంధిత అధికారులతో తిరుపతి పార్లమెంట్ సభ్యులు, దిశా చైర్మన్ ఎం. గురుమూర్తి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తో కలసి సమీక్ష నిర్వహించారు.

శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై శాఖల వారిగా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తూ పార్లమెంట్ సభ్యులు మరియు దిశా చైర్మన్, జిల్లా కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మరియు దిశా చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి గ్రామ ఆదర్శ యోజన, ఎం.జి.ఎన్.ఆర్.ఈ జి.ఎస్., పి.ఎం కుసుం, పి.ఎం సూర్య ఘర్ తదితర పథకాలను అర్హులైన లబ్దిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇటివల ముంతా తుఫాన్ నేపథ్యంలో కె.వి.బి పురం మండలము లో రాయలచెరువు గండి పడడం వల్ల కలత్తూరు గ్రామములో తీవ్రంగా నష్టపోయిన గ్రామస్తులకు ఆర్థికముగా అన్ని విధములుగా సహాయ సహకారములు అందించాలని, రైతుల పొలాల్లో ఇసుక మేటలను తొలగించుకొనుటకు, ఆవులు, గేదెలు, మేకలు, కోళ్ళు కోల్పోయిన వారికి, పంట నష్టం కలిగిన వారికి తిరిగి వ్యవసాయము చేసుకోనుటకు రైతులకు కావలసిన విత్తనములు సరఫరా చేయుటకు సంబందిత అధికారులు తగు చర్యలు తీసుకోనవాలన్నారు. రైతులకు పంట నష్టం కలిగినందున ఇన్సురెన్స్ నగదును వారికి చెల్లించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కే వి బి పురం మండలం నందు జరిగిన విపత్తుకు తన ఎం.పి ల్యాడ్స్ నిధుల నుండి ఒక కోటి రూపాయల నిధులను విడుదల చేస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు. రేణిగుంట, నాయుడుపేట హై వే నందు తరచూ ప్రమాదములు జరుగుతున్నాయని వాటి నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పలు చోట్ల సర్వీసు రోడ్లను ఏర్పాటు చేయలని, గ్రామాలలో కనెక్టవిటీ రోడ్లు లేని చోట వీటి ఏర్పాటుకు సంబందిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఎం.పి. ల్యాడ్స్ నిధుల వినియోగంలో జాప్యము జరుగుతున్నందున తిరిగి ప్రభుత్వం నుండి నిధులు కేటాయింపులో ఆలస్యం జరుగుతున్నదని కావున అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అదనంగా నిధులను కోరుటకు అవకాశం ఉంటుందన్నారు . SC, ST లు సాగు చేసుకోనుచున్న భూములలో పట్టాలు మంజూరులో అటవీ శాఖకు సంబందించిన భూముల విషయములో సమస్యలు ఎదురవుతున్నందున రెవెన్యు మరియు అటవీ శాఖ అధికారులు సమన్వయంతో వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశానికి స్థానికంగా ఉన్న ఎం పి పి లు, ఎం పి టి సి లు , సర్పంచులను కార్యక్రామాలకు ఆహ్వానించడం ద్వారా కార్యక్రమంలో చర్చలు జరుగుతున్న అంశాలు, నిర్ణయాలు వారికి కూడా తెలిసే అవకాశం ఉంటుందని ఇలాంటి సమావేశాలలో వాటి సంబందించిన ప్రస్తావనలు తెలుపుటకు వారికి అనుకూలం ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రం నుండి అమలు అవుతున్న పథకాలను సమన్వయంతో అమలు కొరకు జిల్లాల్లో సమన్వయ అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం మూడు నెలలకు ఒకసారి నిర్వహించుకునేలా కేంద్ర ప్రభుత్వ నిర్దేశాలు మేరకు నిర్వహించు కుంటున్నామని, గౌ. ప్రధాన మంత్రి ఈ అంశంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఉంటారని అన్నారు. దిశా సమావేశానికి గైర్హాజరు అయితే చర్యలు తప్పవన్నారు. అర్హులైన పేదలకు, లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంక్షేమ పథకాలను అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. తదుపరి సమావేశం ఫిబ్రవరి మాసంలో ఉంటుందని తెలిపారు. సమావేశానికి సంబంధించిన సమాచారం గౌరవ సభ్యులకు ఇవ్వబడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు అందే ప్రతి శాఖ ఈ సమావేశానికి తప్పక హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబందించిన ఎ.టి.ఆర్. రిపోర్ట్ లను సమావేశానికి అందించాలన్నారు.

గత దిశ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పంచయాతీ రాజ్, మునిసిపాలిటి, డ్వామా, గృహనిర్మాణ శాఖ, టిడ్కో, అగ్రికల్చర్ ,ఇరిగేషన్, పశు సంవర్థక శాఖ, ఐ సి డి ఎస్, ఆరోగ్య శాఖ, జలవనరుల శాఖ, విద్యా శాఖ, ట్రాన్స్కో, గనుల శాఖ, సివిల్ సప్లై , పరిశ్రమలు , సంక్షేమ శాఖలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులను నిర్దేశించిన గడువులోగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబందిత శాఖల అధికారులు నిధులను వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందించడంలో అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలనీ సూచించారు. తదుపరి అన్ని శాఖల వారు సమన్యయముతో పనిచేసి పురోగతి సాధించాలని తెలిపారు.

ఈ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల జిల్లా పరిషత్ సి ఈ ఓ రవి కుమార్ నాయుడు, నెల్లూరు జిల్లా సి ఈ ఓ మోహన్ కుమార్, జిల్లాలోని మునిసిపల్ చైర్మెన్ లు , మునిసిపల్ కమిషనర్ లు , సోషల్ వెల్ఫేర్ డి డి విక్రం కుమార్ రెడ్డి, డి పి ఓ సుశీలా దేవి ,డి ఆర్ డి ఎ పిడి శోభన్ బాబు, డ్వామ పి డి శ్రీనివాస రావు, డి ఎం అండ్ హెచ్ ఓ బాలకృష్ణ నాయక్, డి ఈ ఓ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్, ల్యాండ్ అండ్ సర్వే ఎ డి అరుణ్ కుమార్, ఐ సి డి ఎస్ పిడి వసంత బాయ్ , గనుల శాఖ అధికారి బాలాజీ నాయక్, కార్మిక శాఖ అధికారి చిన్న లాలప్ప , తిరుపతి స్మార్ట్ సిటి మేనేజర్ చంద్ర మౌళి , నేషనల్ హైవే పిడి, సంబందిత జిల్లా అధికారులు , తిరుపతి మునిసిపల్ డిప్యూటి మేయర్ ఆర్ సి ముని కృష్ణా , ఎం పిపి లు,సంబందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *