తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగరంలోని మంగళం రోడ్డులో జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశాల మేరకు, సెల్ ఫోన్ వినియోగిస్తూ ద్విచక్ర వాహనాలు నడపుతున్న వారిపై కేసులు నమోదు చేసి, రవాణా శాఖ మోటార్ వాహన తనిఖీ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ తనిఖీలలో 22 ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు చేయడం జరిగింది. చరవాణి వినియోగిస్తూ వాహనం నడుపుతున్న పది ద్విచక్ర వాహనాలపై , ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న మరో పది వాహనాలపై మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుతున్న రెండు వాహనాల పై కేసులునమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోటార్ వాహనాల తనిఖీ అధికారి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మోటార్ వాహనాల సెక్షన్ 184 ప్రకారం మొబైల్ ఫోన్ డ్రైవింగ్ చేసేవారికి మొదటిసారిగా Rs.1500 మరియు రెండవసారి అదే వాహనాన్ని వినియోగిస్తూ మొబైల్ డ్రైవింగ్ చేసిన పక్షంలో రూ.10,000 వరకు అపరాధ రుసుము ఉంటుందని తెలియజేశారు. మోటార్ వాహనాల తనిఖీ అధికారి అతికా నాజ్ మాట్లాడుతూ మొబైల్ డ్రైవింగ్ చేసే వారి డ్రైవింగ్ లైసెన్స్ లను మూడు నెలల వరకు సస్పెండ్ చేయటానికి సిఫారసు చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సహాయ మోటార్ వాహనాల తనిఖీ అధికారి స్వర్ణలత పాల్గొన్నారు
Prajavartha Online Telugu News